Breaking News

వాళ్లు సచిన్‌ కంటే లారా బెటర్‌ అనుకుంటారు.. కానీ: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌

Published on Mon, 01/01/2024 - 11:05

ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజ బ్యాటర్‌ అనగానే గుర్తొచ్చే పేరు సచిన్‌ టెండుల్కర్‌. పదహారేళ్ల వయసులో.. 1989లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ‘మాస్టర్‌ బ్లాస్టర్‌’ 2013లో ఆటకు వీడ్కోలు పలికాడు. ఇరవై నాలుగేళ్లపాటు సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో అతడు లెక్కకుమిక్కిలి ఘనతలు సాధించిన విషయం తెలిసిందే.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా వంద సెంచరీలు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న ఈ లెజెండ్‌.. అత్యధిక పరుగుల వీరుడిగానూ చెక్కు చెదరని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వీటితో పాటు మరెన్నో అరుదైన ఫీట్లు నమోదు చేసి అత్యుత్తమ క్రికెటర్‌గా నేటికీ నీరాజనాలు అందుకుంటున్నాడు.

అయితే, ఆస్ట్రేలియన్లు మాత్రం వెస్టిండీస్‌ లెజెండ్‌ బ్రియన్‌ లారానే సచిన్‌ కంటే మెరుగైన ఆటగాడని భావిస్తారట. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ అలీ బచర్‌ ఈ మాట అంటున్నాడు. అయితే, తన దృష్టిలో మాత్రం సచిన్‌.. లారా కంటే ఎంతో గొప్ప క్రికెటర్‌ మాత్రమే కాదు.. మంచి మనిషి కూడా అని పేర్కొన్నాడు.

అందుకే సచిన్‌ గొప్ప బ్యాటర్‌ అంటాను
ఈ మేరకు హిందుస్థాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘సచిన్‌ టెండుల్కర్‌ అసాధారణ ఆటగాడు. అందరిలా కాకుండా.. అతడు వేరొక గ్రహం నుంచి వచ్చాడనే అనుకుంటా. అతడు ఆడిన గొప్ప ఇన్నింగ్స్‌ ఎన్నో చూశాను.

అయితే, వాటన్నింటి కంటే కూడా వ్యక్తిగా అతడు మిగత వారి కంటే ఎంతో ఉత్తముడు. అతడు మైదానంలోపల లేదంటే వెలుపల.. ఎవరితోనైనా వాదనకు దిగడం చూశారా? నేనైతే ఎప్పుడూ అలాంటివి చూడలేదు.

అందుకే అతడు మిగతా వాళ్లకంటే గొప్పవాడు. ఆనందజీవి అని చెబుతాను. మీకు తెలుసా.. ఆస్ట్రేలియన్లు సచిన్‌ కంటే లారా బెటర్‌ అని భావిస్తారు. నేనైతే ఆ మాటను రబ్బిష్‌ అని కొట్టిపారేస్తా.

బ్రియన్‌ లారా నాలుగు మిలియన్ల మంది ముందు ఆడితే.. ఈ మనిషి(సచిన్‌ను ఉద్దేశించి) 1.4 బిలియన్ల మంది కోసం ఆడాడు. అలాంటపుడు అతడిపై ఎంత ఒత్తిడి ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించారా? అదీ అతడి గొప్పతనం’’ అని అలీ బచర్‌.. సచిన్‌ టెండుల్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా అలీ సౌతాఫ్రికా తరఫున పన్నెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.

పరుగుల వీరుడు సచిన్‌ టెండుల్కర్‌
అంతర్జాతీయ కెరీర్‌ సచిన్‌ టెండుల్కర్‌ టెస్టుల్లో 15,921 పరుగులు సాధించాడు. ఇందులో 51 శతకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 18426 రన్స్‌ తీశాడు. ఇందులో 49 సెంచరీలు ఉన్నాయి. టీమిండియా తరఫున ఆరు ప్రపంచకప్‌ టోర్నీల్లో ప్రాతినిథ్యం వహించాడు. 2011లో వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు.

చదవండి: 2024 ఏడాదిలో టీమిండియా షెడ్యూల్‌ ఇదే.. ఈ సారైనా కల నెరవేరేనా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)