Breaking News

Australian Open 2024: విన్నర్‌ సినెర్‌...

Published on Mon, 01/29/2024 - 05:23

మెల్‌బోర్న్‌: సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, 10 సార్లు చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా)పై తాను సాధించిన విజయం గాలివాటమేమీ ఇటలీ యువతార యానిక్‌ సినెర్‌ నిరూపించాడు. టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో నాలుగో సీడ్‌ సినెర్‌ చాంపియన్‌గా అవతరించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను అందుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ సినెర్‌ 3–6, 3–6, 6–4, 6–4, 6–3తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై చిరస్మరణీయ విజయం సాధించాడు.

తద్వారా 1976 తర్వాత పురుషుల సింగిల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన ఇటలీ ప్లేయర్‌ గా, ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ సాధించిన తొలి ఇటలీ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. 3 గంటల 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 22 ఏళ్ల సినెర్‌ తొలి రెండు సెట్‌లు కోల్పోయినా ఆందోళన చెంద లేదు. మూడో సెట్‌ నుంచి సినెర్‌ నెమ్మదిగా లయలోకి వచ్చాడు. కెరీర్‌లో ఆరోసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడుతున్న మెద్వెదెవ్‌పై ఒత్తిడి తెచ్చాడు.

మూడో సెట్‌ పదో గేమ్‌లో, నాలుగో సెట్‌ పదో గేమ్‌లో మెద్వెదెవ్‌ సరీ్వస్‌లను బ్రేక్‌ చేసిన సినెర్‌    రెండు సెట్‌లు గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్‌లో ఆరో గేమ్‌లో మెద్వెదెవ్‌ సరీ్వస్‌ను బ్రేక్‌ చేసిన సినెర్‌ ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. విజేత సినెర్‌కు 31 లక్షల 50 వేల ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ. 17 కోట్ల 22 లక్షలు), రన్నరప్‌ మెద్వెదెవ్‌కు 17 లక్షల 25 వేల ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ. 9 కోట్ల 42 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)