ఆసీస్‌ దిగ్గజం మైఖల్‌ క్లార్క్‌కు క్యాన్సర్‌

Published on Wed, 08/27/2025 - 13:01

ఆస్ట్రేలియా దిగ్గ‌జం మాజీ కెప్టెన్,  మైఖేల్ క్లార్క్ మ‌రోసారి క్యాన్స‌ర్ బారిన ప‌డ్డాడు. త‌ను చర్మ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు క్లార్క్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్ద‌ని ప్ర‌తి ఒక్క‌రు కూడా హెల్త్ చెక‌ప్ చేయించుకోవాల‌ని కోరాడు.

"నేను చ‌ర్మ క్యాన్స‌ర్‌తో పోరాడుతున్నాను. ఈ రోజు నా ముక్కుపై ఏర్పడిన క్యాన్సర్ కణితిని సర్జరీ ద్వారా తొలిగించారు. ఆస్ట్రేలియాలో స్కిన్‌ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.  మీరందరూ క్రమం తప్పకుండా చర్మ పరీక్షలు చేయించుకోవాలి. నివారణ అనేది చికిత్స కంటే ఉత్తమమైనది. నా విష‌యంలో రెగ్యూల‌ర్ చెక‌ప్‌లు, ముందుగా గుర్తిచడం వ‌ల్లే నేను కోలుకో గలుగుతున్నాను. 

దీన్ని ముందుగానే గుర్తించిన  నా డాక్టర్ బిష్ సోలిమన్‌కు కృతజ్ఞతలు" అని క్లార్క్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో క్లార్క్‌ రాసుకొచ్చాడు. గ‌తంలో కూడా క్లార్క్ ముక్కుపై ఓ క్యాన్స‌ర్ గ‌డ్డ‌ను వైధ్యులు తొలిగించారు. కాగా ఆస్ట్రేలియాలో చ‌ర్మ క్యాన్స‌ర్ కేసులు అత్య‌ధికంగా న‌మోదవుతున్నాయి.  సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత(UV)  ప్రభావం ఎక్కువగా ఉండటం, చర్మ కణాల అనియంత్రిత పెరగడమే ఇందుకు ప్ర‌ధాన‌క కార‌ణం.

కాగా 44 ఏళ్ల మైఖ‌ల్ క్లార్క్ ఆస్ట్రేలియా క్రికెట్ చ‌రిత్ర‌లో త‌నకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు.  2004లో ఆస్ట్రేలియా త‌ర‌పున అరంగేట్రం చేసిన క్లార్క్.. త‌న కెరీర్‌లో 15 టెస్టులు, 245 వన్డేలు  34 టీ20లు ఆడాడు. టెస్టు, వ‌న్డేల్లో కంగారూ జ‌ట్టుకు సార‌థ్యం కూడా వ‌హించాడు. అతడి కెప్టెన్సీలోనే ఆస్ట్రేలియా 2013-14 యాషెస్ సిరీస్‌తో పాటు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2015ను కూడా ఆసీస్ సొంతం చేసుకుంది.
చదవండి: Asia Cup 2025: ఆసియాకప్‌లో టీమిండియా ఓపెనర్లు ఎవరు?

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)