న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా..

Published on Fri, 03/21/2025 - 12:11

న్యూజిలాండ్ మ‌హిళ‌ల‌తో మూడు టీ20ల సిరీస్‌ను ఆస్ట్రేలియా విజ‌యంతో ఆరంభించింది. ఆక్లాండ్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది. కివీస్‌ నిర్ధేశించిన 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ అమ్మాయిలు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.3 ఓవర్లలోనే ఛేదించారు.

లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ బెత్‌ మూనీ విధ్వంసం సృష్టించింది. కేవలం 42 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు మరో ఓపెనర్‌ జార్జియా వాల్‌(31 బంతుల్లో 9 ఫోర్లతో 50) హాఫ్‌ సెంచరీతో మెరిసింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో తహుహు రెండు వికెట్లు సాధించగా.. మిగితా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.

అంతకముందు బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. వైట్‌ఫెర్న్స్‌ బ్యాటర్లలో అమీలియా కేర్‌(51 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సోఫీ డివైన్‌(39) పర్వాలేదన్పించారు. ఆసీస్‌ బౌలర్లలో బ్రౌన్‌, మెక్‌గ్రాత్‌ తలా వికెట్‌ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 23న మౌంట్ మౌంగనుయ్ వేదికగా జరగనుంది. ఆసీస్‌తో సిరీస్‌ కంటే ముందు శ్రీలంకతో జరిగిన వైట్‌బాల్‌ సిరీస్‌లను న్యూజిలాండ్‌ సొంతం చేసుకుంది.
చదవండి: IPL 2025: ఐపీఎల్‌ వేలంలో అన్‌సోల్డ్‌.. కట్‌ చేస్తే! పంత్‌ టీమ్‌లోకి ఎంట్రీ?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)