Breaking News

ఆసీస్‌ను పాక్‌ ఆపతరమా..? తొలి టెస్టుకు సర్వం సిద్దం

Published on Thu, 12/14/2023 - 07:02

పెర్త్‌: ప్రపంచకప్‌ గెలిచిన సమరోత్సాహంతో ఉన్న ఆ స్ట్రేలియా, పేలవ ప్రదర్శనతో పరిమిత ఓవర్ల లోనూ తడబడుతున్న పాకిస్తాన్‌ మధ్య టెస్టు సమరానికి రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే తొలి టెస్టులో ఇరు జట్లు తలపడనున్నాయి. సొంతగడ్డపై తిరుగులేని జట్టయిన ఆసీస్‌ అన్ని రకాలుగా బలంగా కనిపిస్తూ నిస్సందేహంగా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. మరో వైపు వరల్డ్‌ కప్‌ వైఫల్యం తర్వాత జట్టు, కెప్టెన్‌ల మార్పులతో పాక్‌ బరిలోకి దిగుతోంది.

1995లో ఆసీస్‌ గడ్డపై చివరి సారిగా టెస్టు మ్యాచ్‌ నెగ్గిన పాక్‌ ఒక్కసారి కూడా సిరీస్‌ గెలవలేదు. 1999 టూర్‌నుంచి ఆ జట్టు వరుసగా 14 టెస్టుల్లో ఓడింది. కనీసం ‘డ్రా’గా కూడా ముగించలేకపోయింది.   టెస్టుకు ముందు ఆసీస్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖాజా గాజాలో పాలస్తీనాకు మద్దతు తెలుపుతున్నట్లుగా తన షూస్‌కు ‘ఆల్‌ లైవ్స్‌ ఆర్‌ ఈక్వల్‌’ అనే క్యాప్షన్‌తో ప్రాక్టీస్‌తో పాల్గొన్నాడు.

అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఇలాంటి క్రికెట్‌ మైదానంలో ప్రదర్శించరాదు. ఖాజాకు తన భావాలను ప్రదర్శించే స్వేచ్ఛ ఉందని ఆసీస్‌ బోర్డు, కెప్టెన్‌ కమిన్స్‌ అండగా నిలిచినా... అతను ఆ వ్యాఖ్యలు ఉన్న షూస్‌తో టెస్టు బరిలోకి దిగరాదని నిర్ణయించుకున్నాడు. తనది రాజకీయ ప్రకటన కాదని, మానవత్వం మాత్రమేనని ఖాజా అన్నాడు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)