Breaking News

టీమిండియా కోసం.. అన్ని జట్లు దుబాయ్‌లోనే?

Published on Sun, 03/02/2025 - 08:24

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో సెమీస్ బెర్త్‌లు అధికారికంగా ఖారార‌య్యాయి. గ్రూపు-ఎ నుంచి భార‌త్‌, న్యూజిలాండ్, గ్రూపు-బి నుంచి ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు సెమీఫైన‌ల్‌కు చేరుకున్నాయి. అయితే ఈ నాలుగు జ‌ట్లు సెమీస్‌కు చేరిన‌ప్ప‌టికి వాటి స్థానాలు ఇంకా ఖారారు కాలేదు.

ఆదివారం న్యూజిలాండ్‌-భార‌త్ మ‌ధ్య జ‌రిగే ఆఖ‌రి లీగ్ మ్యాచ త‌ర్వాతే సెమీస్‌లో ఎవ‌రి ప్ర‌త్య‌ర్ధి ఎవ‌ర‌న్న‌ది తేల‌నుంది. కాగా మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో భారత ఆడటం ఇప్పటికే ఖాయమైన సంగ‌తి తెలిసిందే. కానీ ప్ర‌త్య‌ర్ధి సౌతాఫ్రికా లేదా ఆస్ట్రేలియా నా అన్న‌ది నేడు ఖారారు కానుంది. 

ఈ క్ర‌మంలో చాంపియన్స్‌ ట్రోఫీ గ్రూప్‌ ‘బి’ నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు దుబాయ్‌కు పయనమయ్యాయి. రెండింటిలో ఒక జట్టు మైదానంలోకి దిగకుండానే మళ్లీ లాహోర్‌కు రావాల్సి ఉంటుంది.  కివీస్‌తో చివరి పోరులో భారత్‌ విజయం సాధిస్తే ఆస్ట్రేలియాతో రోహిత్‌ సేన మంగళవారం తొలి సెమీఫైనల్‌ ఆడుతుంది.

ఇదే జరిగితే దక్షిణాఫ్రికా జట్టు తిరిగి పాకిస్తాన్‌ చేరుకుంటుంది. ఒకవేళ కివీస్‌ చేతిలో ఓడితే టీమిండియా ప్రత్యర్థి దక్షిణాఫ్రికా కానుంది. కంగారూలు రెండో సెమీఫైనల్‌ కోసం పాకిస్తాన్‌కు తిరుగు పయనం కానున్నారు. కీలక సెమీఫైనల్‌కు ముందు దుబాయ్‌ మైదానంలో ప్రాక్టీస్‌ చేయడంతో పాటు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా జట్లకు ఇది ఉపయోగపడనుంది.

ఇక కివీస్‌తో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. ఈ ఆఖరి మ్యాచ్‌లో భారత్‌​ ఓమార్పుతో బరిలోకి దిగింది.

తుది జట్ల వివరాలు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్ ), శుబ్‌మన్‌ గిల్, కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్, రిషబ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్, హర్షిత్‌ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్‌ సింగ్‌. 

న్యూజిలాండ్‌: మిచెల్‌ సాంట్నర్‌ (కెప్టెన్ ), డెవాన్‌ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్‌ విలియమ్సన్, డార్లీ మిచెల్, టామ్‌ లాథమ్, గ్లెన్‌ ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్,హెన్రీ, రూర్కే.
చదవండి:SA vs Eng: ఇంగ్లండ్‌కు ఘోర అవమానం.. బాధతో బట్లర్‌ బైబై

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)