Breaking News

రసవత్తరంగా కివీస్‌-ఆసీస్‌ రెండో టెస్టు..

Published on Sun, 03/10/2024 - 12:21

క్రైస్ట్‌ చర్చ్‌ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆసీస్‌ తమ విజయానికి ఇంకా 202 పరుగుల దూరంలో నిలవగా.. కివీస్‌ విజయానికి ఇంకా 6 వికెట్లు మాత్రమే కావాలి. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు ​కోల్పోయి 77 పరుగులు చేసింది.

క్రీజులో ప్రస్తుతం ట్రావిస్‌ హెడ్‌(17),మార్ష్‌(27) పరుగులతో ఉన్నారు. మాట్‌ హెన్రీ, సీర్స్‌ తలా రెండు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌ స్టార్‌ ఓపెనర్‌ స్టీవ్‌ స్మిత్‌(9) రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచాడు. ఇక 134/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్‌ 372 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో రచిన్‌ రవీంద్ర(82), టామ్‌ లాథమ్‌(73) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.

ఆసీస్‌ బౌలర్లలో కమ్మిన్స్‌ 4 వికెట్లు, లయోన్‌ 3 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో ఆసీస్‌ ముందు 279 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అంతకుముందు కివీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులు చేసింది. ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల ఆధిక్యం లభించింది.
చదవండి: IPL 2024: 'చెన్నై, ముంబై, సన్‌రైజర్స్‌ కాదు.. ఈ సారి ఐపీఎల్‌ టైటిల్‌ ఆ జట్టుదే'

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి