Breaking News

ఓటమి అంచుల్లో ఇంగ్లండ్‌

Published on Sun, 12/07/2025 - 08:01

బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్ట్‌ వన్‌ సైడెడ్‌గా సాగుతోంది. మరోసారి ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చలాయించింది. తొలి టెస్ట్‌లో బంపర్‌ విక్టరీ సాధించిన ఆసీస్‌ మరోసారి అదే స్థాయి గెలుపు దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసి ఓటమి అంచుల్లో నిలిచింది. 

ఈ మ్యాచ్‌లో ఇంగ్లం​డ్‌ గట్టెక్కడం అసంభవం. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంగ్లండ్‌ ఇంకా 43 పరుగులు వెనుకపడి ఉంది. ఇన్నింగ్స్‌ పరాభవం తప్పించుకోవాలంటే ఇంగ్లండ్‌ మిగిలిన 4 వికెట్లు కోల్పోకముందే ఈ పరుగులు చేయాలి. బెన్‌ స్టోక్స్‌ (4), విల్‌ జాక్స్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. 

ఆసీస్‌ పేసర్లు మిచెల్‌ స్టార్క్‌, మైఖేల్‌ నెసర్‌, స్కాట్‌ బోలాండ్‌ తలో 2 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బేశారు. ఇం​గ్లండ్‌ ఇన్నింగ్స్‌లో క్రాలే 44, డకెట్‌ 15, పోప్‌ 26, రూట్‌ 15, బ్రూక్‌ 15, జేమీ స్మిత్‌ 4 పరుగులు చేసి ఔటయ్యారు. వీరందరికీ మంచి ఆరంభమే లభించినప్పటికీ.. ఒక్కరు కూడా భారీ స్కోర్‌ చేయలేకపోయారు.

అంతకుముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. జట్టులో 11 మంది తలో చేయి వేసి ఈ స్కోర్‌ వచ్చేలా చేశారు. స్పెషలిస్ట్‌ బౌలర్‌ అయిన మిచెల్‌ స్టార్క్‌ (77) బ్యాట్‌తోనూ చెలరేగి టాప్‌ స్కోరర్‌గా నిలవడం విశేషం.

స్టార్క్‌తో పాటు మరో నలుగురు కూడా అర్ద సెంచరీలు చేశారు. జేక్‌ వెదరాల్డ్‌ 72, లబూషేన్‌ 65, స్టీవ్‌ స్మిత్‌ 61, అలెక్స్‌ క్యారీ 63 పరుగులు చేశారు.

ట్రవిస్‌ హెడ్‌ (33), గ్రీన్‌ (45) కూడా పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లలో ఇంగ్లిస్‌ 23, నెసర్‌ 16, బోలాండ్‌ 21 (నాటౌట​్‌), డాగెట్‌ 13 పరుగులు చేశారు. ఇం​గ్లండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌ 4 వికెట్లతో సత్తా చాటగా.. స్టోక్స్‌ 3, ఆర్చర్‌, అట్కిన్సన్‌, జాక్స్‌ తలో వికెట్‌ తీశారు.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జో రూట్‌(138) అద్భుతమైన సెంచరీతో చెలరేగడంతో 334 పరుగులు చేసింది. జాక్ క్రాలీ(76),ఆర్చర్‌(38) రాణించారు. మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తా చాటాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఆసీస్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)