Breaking News

వార్నర్‌ను పరిగణలోకి తీసుకోం..!

Published on Mon, 07/15/2024 - 15:53

అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలనుకున్న డేవిడ్‌ వార్నర్‌ ఆశలపై ఆస్ట్రేలియా చీఫ్‌ సెలెక్టర్‌ జార్జ్‌ బెయిలీ నీళ్లు చల్లాడు. వచ్చే ఏడాది పాక్‌ వేదికగా జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీకి వార్నర్‌ను పరిగణలోకి తీసుకోవడం లేదని వెల్లడించాడు. వార్నర్‌ ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌ 2024తో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. అనంతరం కొద్ది రోజుల్లోనే మనసు మార్చుకుని ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కి అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. 

వార్నర్‌ ప్రకటనపై తాజాగా జార్జ్‌ బెయిలీ స్పందించాడు.  తమ ఫ్యూచర్‌ ప్లాన్స్‌లో వార్నర్‌ లేడని స్పష్టం చేశాడు. తమకున్న సమాచారం మేరకు వార్నర్‌ మూడు ఫార్మాట్ల నుంచి రిటైరయ్యాడని తెలిపాడు. వార్నర్‌ ఎప్పుడు జోక్‌ చేస్తాడో.. ఎప్పుడు సీరియస్‌గా ఉంటాడో తెలీదని అన్నాడు. 

వార్నర్‌ కెరీర్‌ అద్బుతంగా సాగిందని గుర్తు చేశాడు. తమ ప్రణాళికల్లో కొత్త ఆటగాళ్లు ఉన్నారని పేర్కొన్నాడు. బెయిలీ మాటలను బట్టి చూస్తే వార్నర్‌ తిరిగి జట్టులోకి రావాలనుకున్నా అవకాశం లేదన్న విషయం స్పష్టమవుతుంది.

ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌ 2024లో సూపర్‌-8 దశలోనే నిష్క్రమించిన ఆస్ట్రేలియా.. త్వరలో ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సన్నద్దమవుతుంది. ఈ రెండు సిరీస్‌లకు ఆసీస్‌ సెలెక్టర్లు ఇవాళ (జులై 15) జట్లను ప్రకటించారు. 

ఆస్ట్రేలియా తొలుత స్కాట్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ (సెప్టెంబర్‌ 4, 6, 7) ఆడనుంది. అనంతరం సెప్టెంబర్‌ 11 నుంచి ఇంగ్లండ్‌ పర్యటన మొదలవుతుంది. ఈ పర్యటనలో ఆసీస్‌ మూడు టీ20లు (సెప్టెబంర్‌ 11, 13, 15).. ఐదు వన్డేలు (సెప్టెంబర్‌ 19, 21, 24, 27, 29) ఆడనుంది. 

స్కాట్లాండ్‌, ఇంగ్లండ్‌తో టీ20లకు ఆసీస్‌ జట్టు..
మిచెల్‌ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.

ఇంగ్లండ్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు..
మిచెల్‌ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌, ఆరోన్ హార్డీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబూషేన్‌, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)