Breaking News

ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన.. యువ సంచలనం రీఎంట్రీ

Published on Wed, 06/25/2025 - 09:56

వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌-2025లో ఓట‌మి త‌ర్వాత ఆస్ట్రేలియా తొలి స‌వాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్ద‌మైంది. డ‌బ్ల్యూటీసీ సైకిల్ 2025-27లో భాగంగా నేటి నుంచి వెస్టిండీస్‌-ఆసీస్ మ‌ధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు బార్బోడోస్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

ఈ క్ర‌మంలో మొద‌టి టెస్టు కోసం ఆసీస్‌, విండీస్ త‌మ ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ప్ర‌కటించాయి. ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందు కంగారుల‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. స్టీవ్ స్మిత్ చేతి వేలి గాయం కార‌ణంగా తొలి టెస్టుకు దూర‌మ‌య్యాడు.

అత‌డి స్దానంలో తుది జ‌ట్టులోకి వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జోష్ ఇంగ్లిష్ వ‌చ్చాడు. అదేవిధంగా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో ఆసీస్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన మార్న‌స్ ల‌బుషేన్‌ను సెల‌క్ట‌ర్లు ప‌క్క‌న పెట్టారు. ల‌బుషేన్ స్దానంలో సామ్ కాన్‌స్టాస్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ద‌క్కించుకున్నాడు. గతేడాది ఆఖరిలో భారత్‌పై టెస్టు అరంగేట్రం చేసిన కాన్‌స్టాస్‌ తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి మళ్లీ టీమ్‌ మెన్‌జ్‌మెంట్‌ మరో అవకాశం కల్పించింది.

ఇక ఈ రెండు మార్పులు మిన‌హా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో ఆడినే జ‌ట్టును ఆసీస్ కొన‌సాగించింది. మ‌రోవైపు ఈ సిరీస్ నుంచే స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ రోస్ట‌న్ చేజ్ వెస్టిండీస్ టెస్టు కెప్టెన్‌గా  త‌న ప్ర‌స్ధానాన్ని ప్రారంభించ‌నున్నాడు. గ‌త నెల‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్ విండీస్ టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేయ‌డంతో చేజ్ ఎంపిక అనివార్య‌మైంది. ఈ మ్యాచ్‌లో విండీస్ న‌లుగురు పేస‌ర్లు, ఒక స్పెష‌లిస్టు స్పిన్న‌ర్‌తో బ‌రిలోకి దిగ‌నుంది.

తుది జ‌ట్లు
వెస్టిండీస్ ప్లేయింగ్‌ ఎలెవన్‌: 1. క్రెయిగ్ బ్రాత్‌వైట్, 2. జాన్ కాంప్‌బెల్, 3. కీసీ కార్టీ, 4. బ్రాండన్ కింగ్, 5. రోస్టన్ చేజ్ (సి), 6. షాయ్ హోప్ (వికెట్ కీపర్), 7. జస్టిన్ గ్రీవ్స్, 8. జోమెల్ వారికన్, 9. అల్జారి జోసెఫ్, 10. షమర్ జోసెఫ్, 11. జేడెన్ సీల్స్

ఆస్ట్రేలియా ప్లేయింగ్‌ ఎలెవన్‌: 1. ఉస్మాన్ ఖవాజా, 2. సామ్ కాన్‌స్టాస్, 3. కామెరాన్ గ్రీన్, 4. జోష్ ఇంగ్లిస్, 5. ట్రావిస్ హెడ్, 6. బ్యూ వెబ్‌స్టర్, 7. అలెక్స్ కారీ (వికెట్ కీపర్), 8. పాట్ కమ్మిన్స్ (సి), 9. మిచెల్ స్టార్క్, 10. నాథన్ లియాన్, 11. జోష్ హాజిల్‌వుడ్
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)