Breaking News

భారత్‌తో నాలుగో టెస్టు.. ఆసీస్‌ తుది జట్టు ప్రకటన

Published on Wed, 12/25/2024 - 10:29

మెల్‌బోర్న్ వేదిక‌గా డిసెంబ‌ర్ 26 నుంచి భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న నాలుగో టెస్టు కోసం త‌మ తుది జ‌ట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్ర‌క‌టించింది. ఈ మ్యాచ్‌కు ముందు తొడ కండరాల గాయంతో బాధ‌ప‌డిన ఆసీస్ విధ్వంస‌క‌ర ఆట‌గాడు ట్రావిస్ హెడ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో బాక్సింగ్ డే టెస్ట్‌లో హెడ్ ఆడ‌నున్నాడు. కాగా ఆస్ట్రేలియా తుది జ‌ట్టులో రెండు మార్పులు చేసింది.

ఓపెన‌ర్ నాథ‌న్ మెక్‌స్వీనీ స్ధానంలో యువ సంచ‌ల‌నం సామ్ కాన్‌స్టాస్‌కు ఆసీస్ జ‌ట్టు మెనెజ్‌మెంట్ చోటు ఇచ్చింది. 19 ఏళ్ల కాన్‌స్టాస్ ప్ర‌స్తుతం సూప‌ర్‌ ఫామ్‌లో ఉన్నాడు. దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తుండ‌డంతో సెల‌క్ట‌ర్లు అత‌డిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. కాన్‌స్టాస్.. ఉస్మాన్‌ ఖావాజాతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు.

మరోవైపు గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైన జోష్‌ హాజిల్‌ వుడ్‌ స్ధానంలో స్కాట్‌ బోలాండ్‌ తుది జట్టులోకి వచ్చాడు. బోలాండ్‌ ఇప్పటికే పింక్‌ బాల్‌ టెస్టులో సత్తాచాటాడు. మూడో టెస్టుకు హాజిల్‌వుడ్‌ అందుబాటులోకి రావడంతో బోలాండ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. మళ్లీ ఇప్పుడు అతడు జట్టు నుంచి బయటకు వెళ్లడంతో బోలాండ్‌కు ఛాన్స్‌ లభించింది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ ఆధిక్యం సంపాదించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

తుది జట్టు
ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లబుషేన్‌, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్‌), పాట్ కమిన్స్ (కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)