Breaking News

ప్రాణాపాయ స్థితిలో ఆసీస్‌ బ్యాటింగ్‌ దిగ్గజం

Published on Wed, 12/31/2025 - 12:14

ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్‌ డామియన్‌ మార్టిన్‌ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మెనింజైటిస్‌ కారణంగా తీవ్ర అనార్యోగానికి గురైన అతడు ప్రస్తుతం క్వీన్స్‌లాండ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉన్న మార్టిన్‌కు వైద్యులు మత్తు మందు ఇచ్చి.. తాత్కాలికంగా కోమాలోకి వెళ్లేలా చేశారు.

తాత్కాలికంగా కోమాలోకి పంపి
మెనింజైటిస్‌ వల్ల మార్టిన్‌ మెదడు, ఇతర అవయవాలు పూర్తిగా చెడిపోకుండా ఉండేందుకు వైద్య ప్రక్రియలో భాగంగా డాక్టర్లు ఈ మేరకు చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోగిని తాత్కాలికంగా కోమాలోకి పంపడం ద్వారా కార్డియాక్‌ అరెస్ట్‌ వంటి విపత్కర పరిస్థితుల నుంచి తప్పించే అవకాశం ఉంటుంది.

పదివేలకు పైగా పరుగులు
కాగా 1992 నుంచి 2006 మధ్యకాలంలో డామియన్‌ మార్టిన్‌ ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు. తన కెరీర్‌లో మొత్తంగా 67 టెస్టులు, 208 వన్డేలు, 4 టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఆయా ఫార్మాట్లలో 4406, 5346, 120 పరుగులు సాధించాడు.

ఇక ఇటీవల ఆసీస్‌- ఇంగ్లండ్‌ మధ్య యాషెస్‌ సిరీస్‌లో భాగంగా బాక్సింగ్‌ డే టెస్టుకు ముందు మార్టిన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు. ఆ తర్వాత కాసేపటికే అతడి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మార్టిన్ ఐసీయూలో  ఉన్నాడన్న వార్తతో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

త్వరగా తిరిగి రావాలి
ఆస్ట్రేలియా మాజీ కోచ్‌ డారెన్‌ లెహమాన్‌ స్పందిస్తూ.. ‘‘డామియన్‌ మార్టిన్‌.. ఓ యోధుడు. త్వరలోనే అతడు పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలి’’ అని ఆకాంక్షించాడు. మరోవైపు.. మార్టిన్‌ ప్రాణ స్నేహితుడు ఆడం గిల్‌క్రిస్ట్‌ న్యూస్‌ కార్ప్‌తో మాట్లాడుతూ.. ‘‘అతడికి అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు. అతడి కుటుంబానికి అందరమూ అండగా ఉందాము. అతడి ఆరోగ్యం కోసం ప్రార్థించండి’’ అని పిలుపునిచ్చాడు.

కాగా మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే రక్షిత పొరలు మెనింజెస్‌లో వాపు వస్తే.. ఆ పరిస్థితిని మెనింజైటిస్‌ అంటారు. బాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు ఇందుకు ప్రధాన కారణం. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వికారం, మెడ బిగుసుకుపోవడం వంటివి దీని ప్రధాన లక్షణాలు. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం కావొచ్చు కూడా!.. అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. 

చదవండి: బీసీసీఐ యూటర్న్‌!.. షమీకి గోల్డెన్‌ ఛాన్స్‌!

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)