Breaking News

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌.. ఆస్ట్రేలియా జ‌ట్టులో కీల‌క మార్పు

Published on Tue, 06/17/2025 - 15:17

వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ 2025-27 సైకిల్‌లో తొలి సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు సిద్ద‌మ‌వుతోంది. ఈ నెల ఆఖ‌రిలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు ఆసీస్ వెళ్ల‌నుంది. అయితే ఈ టూర్‌కు ముందు కంగారుల‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గ‌లింది.

ఈ సిరీస్‌కు ఎంపికైన స్టార్ పేస‌ర్ బ్రెండ‌న్ డ‌గెట్ తుంటి గాయం బారిన ప‌డ్డాడు. దీంతో క‌రేబియ‌న్ ప‌ర్య‌ట‌న‌కు డ‌గెట్ దూర‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో అత‌డి స్ధానాన్ని బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ సీన్ అబాట్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా భ‌ర్తీ చేసింది. దేశ‌వాళీ క్రికెట్ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తుండ‌డంతో సెల‌క్ట‌ర్లు అత‌డికి పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా త‌రపున  48 వైట్‌బాల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన అబాట్‌.. ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయ‌లేదు. ఈ ప‌ర్యట‌లో అబాట్ టెస్టుల్లో అడుగుపెట్టే అవ‌కాశ‌ముంది.

ఇక‌ డ‌బ్ల్యూటీసీ 2025 ఫైన‌ల్లో గాయ‌ప‌డిన స్టీవ్ స్మిత్‌ను జ‌ట్టులో క్రికెట్ ఆస్ట్రేలియా కొన‌సాగించింది. అయితే అత‌డు జ‌ట్టుతో పాటు విండీస్‌కు వెళ్లిన‌ప్ప‌టికి.. ఒక‌ట్రెండు మ్యాచ్‌ల‌కు బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. ఎంద‌కుంటే అత‌డు చేతి వేలి గాయం నుంచి కోలుకోవ‌డానికి ఐదు నుంచి ఆరు వారాల స‌మయం ప‌ట్ట‌నుంది.

జూన్ 25 నుంచి ఆసీస్-విండీస్ మ‌ధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. కాగా  డ‌బ్ల్యూటీసీ 2025 ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా చేతిలో ఆసీస్ 5 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే.

ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్

వెస్టిండీస్ టెస్ట్ జట్టు: రోస్టన్ చేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వైస్ కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, క్రైగ్ బ్రాత్‌వైట్, జాన్ కాంప్‌బెల్, కీసీ కార్టీ, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారి జోసెఫ్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, జోహన్ లేన్, మికైల్ లూయిస్, ఆండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)