Breaking News

మెరిసిన రాఘ్వి, షఫాలీ

Published on Sun, 08/24/2025 - 04:28

బ్రిస్బేన్‌: తొలి ఇన్నింగ్స్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన రాఘ్వి బిస్త్‌ (119 బంతుల్లో 86; 13 ఫోర్లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించడంతో ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టుతో ఏకైక అనధికారిక టెస్టులో భారత మహిళల ‘ఎ’ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రాధా యాదవ్‌ సారథ్యంలోని భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 73 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. 

రాఘ్వి బిస్త్, షఫాలీ వర్మ (58 బంతుల్లో 52; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలు సాధించగా... తేజల్‌ హస్నబిస్‌ (52 బంతుల్లో 39; 7 ఫోర్లు) రాణించింది. ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు బౌలర్లలో అమీ ఎడ్గర్‌ 4 వికెట్లు పడగొట్టగా... జార్జియా 2 వికెట్లు తీసింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 158/5తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టు... చివరకు 76.2 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. 

సియానా జింజర్‌ (138 బంతుల్లో 103; 12 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో కదం తొక్కగా... నికోల్‌ ఫాల్టుమ్‌ (91 బంతుల్లో 54; 6 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకుంది. భారత మహిళల ‘ఎ’ జట్టు బౌలర్లలో సైమా ఠాకూర్‌ 3 వికెట్లు పడగొట్టగా... రాధా యాదవ్, మిన్ను మణి చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులు చేసింది. ప్రస్తుతం చేతిలో రెండు వికెట్లు ఉన్న భారత జట్టు... ఓవరాల్‌గా 254 పరుగుల ఆధిక్యంలో ఉంది. జోషిత (9 బ్యాటింగ్‌), టిటాస్‌ సాధు (2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)