Breaking News

లబుషేన్‌ సెంచరీ.. పోరాడుతున్న ఆస్ట్రేలియా 

Published on Sun, 07/23/2023 - 04:23

మాంచెస్టర్‌: ‘యాషెస్‌’ సిరీస్‌ నాలుగో టెస్టులో ఓటమినుంచి తప్పించుకునేందుకు పోరాడుతున్న ఆ్రస్టేలియాకు శనివారం వర్షం రూపంలో అదృష్టం కూడా కలిసొచ్చింది. ఇక ఆ జట్టు మ్యాచ్‌ చివరి రోజు ఆదివారం కూడా వాన కురవడంపై కూడా ఆశలు పెట్టుకోవాలి! 162 పరుగులు వెనుకబడి ఓవర్‌నైట్‌ స్కోరు 113/4తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.

పట్టుదలగా ఆడిన మార్నస్‌ లబుషేన్‌ (173 బంతుల్లో 111; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్‌లో 11వ సెంచరీ పూర్తి చేసుకోగా, మిచెల్‌ మార్ష్ (31 నాటౌట్‌) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. వాన కారణంగా శనివారం మొత్తం 27 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా, ఆస్ట్రేలియా మరో 101 పరుగులు జత చేసింది. అయితే ఆసీస్‌ ఇంకా 61 పరుగులు వెనుకబడి ఉంది. చివరి రోజు మిగిలిన ఐదు వికెట్లతో మరికొన్ని పరుగులు సాధించడంతో పాటు వర్షం కూడా అంతరాయం కలిగిస్తే ‘డ్రా’కు అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆ్రస్టేలియా ‘యాషెస్‌’ను నిలబెట్టుకుంటుంది.   

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)