Breaking News

ఆస్ట్రేలియా చరిత్ర.. అన్ని ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన తొలి జట్టుగా

Published on Sun, 06/11/2023 - 17:41

డబ్ల్యూటీసీ 2021-23 ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా అవతరించింది. జూన్‌ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్‌లోని ఓవల్‌ వేదికగా టీమిండియాతో జరిగిన ఫైనల్లో ఆసీస్‌ 209 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 444 పరుగుల కష్ట సాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కనీసం డ్రాకు కూడా ప్రయత్నించకుండానే 234 పరుగులకు ఆలౌట్‌ అయింది

తొలి సెషన్‌లోపే ఆసీస్‌ బౌలర్ల ధాటికి తోక ముడిచి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. గిల్‌ క్యాచ్‌ విషయంలో చేసిన పొరపాటు మినహా మిగతా అన్ని విషయాల్లో పక్కా ప్లాన్‌తో ఆడిన ఆస్ట్రేలియా పరిపూర్ణ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించింది.

ఇప్పటికే వన్డే, టి20 వరల్డ్‌కప్స్‌తో పాటు ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోపీలు నెగ్గిన ఆస్ట్రేలియా తాజాగా వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల(వన్డే, టి20, టెస్టులు) ఐసీసీ ట్రోఫీలు అందుకున్న తొలి జట్టుగా ఆస్ట్రేలియా రికార్డులకెక్కింది. తాజా డబ్ల్యూటీసీ టైటిల్‌తో కలిసి ఇప్పటివరకు ఆసీస్‌ తొమ్మిది ఐసీసీ టైటిల్స్‌ నెగ్గడం విశేషం.

అందులో వన్డే వరల్డ్‌కప్‌ను ఐదుసార్లు(1987, 1999, 2003, 2007, 2015), ఒక టి20 వరల్డ్‌కప్‌(2021), ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ రెండుసార్లు (2006, 2009)లో గెలుచుకున్న ఆస్ట్రేలియా తాజాగా 2023లో వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ నెగ్గి ఐసీసీ అన్ని మేజర్‌ టైటిల్స్‌ గెలిచిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది.

చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసారు..!

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు