Breaking News

ఐదో టీ20లో వెస్టిండీస్ చిత్తు.. సిరీస్ వైట్‌వాష్ చేసిన ఆసీస్‌

Published on Tue, 07/29/2025 - 10:11

వెస్టిండీస్ ప‌ర్య‌ట‌నను ఆస్ట్రేలియా అద్భుత‌మైన విజ‌యంతో ముగించింది. మంగ‌ళ‌వారం సెయింట్ కిట్స్ వేదిక‌గా విండీస్‌తో జ‌రిగిన ఐదో టీ20లో 3 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపొందింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను కంగారులు వైట్ వాష్ చేశారు.

ఈ ఆఖ‌రి టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన క‌రేబియ‌న్ జ‌ట్టు 19.4 ఓవ‌ర్ల‌లో 170 ప‌రుగుల‌కు ఆలౌటైంది. విండీస్ బ్యాట‌ర్ల‌లో విధ్వంస‌కర బ్యాట‌ర్  షిమ్రాన్ హెట్‌మైర్‌(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. షెర్ఫెన్‌ రూథర్‌ ఫర్డ్‌(35), హోల్డర్‌(20) రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో ద్వార్షుయిస్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్‌ ఎల్లీస్ రెండు వికెట్లు సాధించారు.

వీరిద్దరితో పాటు మాక్స్‌వెల్‌, జంపా, అబాట్‌, హార్దీ తలా వికెట్‌ సాధించారు. అనంతరం 171 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 17 ఓవర్లలోనే చేధించింది. ఆసీస్‌ బ్యాటర్లలో మిచెల్‌ ఓవెన్‌(37) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. గ్రీన్‌(32), హార్దీ(28 నాటౌట్‌), డేవిడ్‌(30) రాణించారు. 

విండీస్‌ బౌలర్లు మరోసారి ఆసీస్‌ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. అకిల్‌ హోస్సేన్‌ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టి పర్వాలేదన్పించాడు. హోల్డర్‌, జోషఫ్‌ తలా రెండు వికెట్లు సాధించినప్పటికి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కాగా ఆస్ట్రేలియా చేతిలో విండీస్‌.. టెస్టు, టీ20 సిరీస్‌లలోనూ వైట్‌వాష్ అయింది.
చదవండి: IND vs ENG: ఆఖరి టెస్టులో బుమ్రా ఆడుతాడా? కీల‌క అప్‌డేట్ ఇచ్చిన గంభీర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)