Breaking News

చ‌రిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

Published on Thu, 09/05/2024 - 08:52

ఎడిన్‌బర్గ్ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్ నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని కంగారులు ఊదిపడేశారు. కేవలం 9.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఆసీస్ చేధించింది.

ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 25 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెడ్‌.. 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్  మిచెల్‌ మార్ష్‌ (12 బంతుల్లో 39; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు.

దక్షిణాఫ్రికా వరల్డ్ రికార్డు బద్దలు..
ఇక ఈ మ్యాచ్‌లో పవర్ ప్లేలో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి ఏకంగా 113 పరుగులు చేసింది. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టు ఆసీస్ రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది.

గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో సఫారీలు పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 102 పరుగులు చేశారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో ప్రోటీస్ ఆల్‌టైమ్ రికార్డును ఆసీస్ బ్రేక్ చేసింది.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)