Breaking News

చెలరేగిన స్టార్క్‌.. ఇంగ్లండ్‌పై ఆసీస్‌ ఘన విజయం

Published on Sun, 09/22/2024 - 07:40

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై ఆస్ట్రేలియా త‌మ జోరును కొన‌సాగిస్తోంది. లీడ్స్ వేదిక‌గా ఇంగ్లీష్ జ‌ట్టుతో జరిగిన రెండో వ‌న్డేలో 69 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వ‌న్డేల సిరీస్ 2-0 ఆధిక్యంలో ఆసీస్ దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ్రస్టేలియా 44.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అలెక్స్‌ క్యారీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 67 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స‌ర్లతో 74 ప‌రుగులు చేశాడు. అత‌డితో పాటు కెప్టెన్ మార్ష్‌(59 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. 

అదేవిధంగా  ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (29; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మాథ్యూ షార్ట్‌ (29; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. స్టీవ్‌ స్మిత్‌ (4), మ్యాక్స్‌వెల్‌ (7), లబుషేన్‌ (19) విఫలమయ్యారు.  ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు పడగొట్టగా, రషీద్, బెతల్‌, పొట్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

నిప్పులు చేరిగిన స్టార్క్‌..
అనంతరం  లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ 40.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌ కీపర్‌ జేమీ స్మిత్‌ (61 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), బెన్‌ డకెట్‌ (32) పోరాడినా ఫలితం లేకపోయింది.  ఆసీస్ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. అతడితో పాటు హాజిల్‌వుడ్‌, హార్దీ, మాక్స్‌వెల్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇరు జట్ల మధ్య మంగళవారం(సెప్టెంబర్ 24) మూడో వన్డే జరగనుంది.
చదవండి: IND vs BAN: అశ్విన్ మాస్ట‌ర్ మైండ్‌.. బంగ్లా బ్యాట‌ర్ ఫ్యూజ్‌లు ఔట్‌(వీడియో)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)