Breaking News

భర్త అడుగుజాడల్లో భార్య.. స్టార్క్‌ దంపతులకు విచిత్ర అనుభవం

Published on Thu, 02/15/2024 - 18:30

భర్త అడుగుజాడల్లో భార్య అనే నానుడును నిజజీవితంలో మనం తరుచూ వింటుంటాం. ఈ మాటను క్రీడాజీవితంలో ఫాలో అయ్యి చూపించింది ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ అలైసా హీలీ. ఆస్ట్రేలియా పురుషుల జట్టు స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ భార్య అయిన హీలీ.. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళల టెస్ట్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. హీలీ క్రికెట్‌కు సంబంధించిన ఓ విషయంలో భర్త స్టార్క్ అడుగుజాడల్లో నడిచింది. యాదృచ్చికంగా చోటు చేసుకున్న ఈ సందర్భం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. 

ఏం జరిగిందంటే.. ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ 2013లో భారత్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌ స్టార్క్‌ కెరీర్‌లో తొమ్మిదవది. యాదృచ్చికంగా స్టార్క్‌ భార్య అలైసా హీలీ కూడా తన తొమ్మిదవ టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇ​న్నింగ్స్‌లో 99 పరుగుల వద్దనే ఔటైంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగతున్న ఏ‍కైక టెస్ట్‌ మ్యాచ్‌లో హీలీ తృటిలో సెంచరీ చేజార్చుకుని బాధతో పెవిలియన్‌కు చేరింది. అయితే తాను భర్త అడుగుజాడల్లోనే నడుస్తున్నానన్న విషయం హీలీ​కి తెలియకపోయి ఉండవచ్చు. తొమ్మిదో టెస్ట్‌లో భార్యా భర్తలు 99 పరుగుల వద్ద ఔట్‌ కావడం ఆసక్తికరంగా మారింది.

కాగా, సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో లిచ్‌ఫీల్డ్‌ (4), ఎల్లిస్‌ పెర్రీ (3), తమిళ మెక్‌గ్రాత్‌ (0) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. బెత్‌ మూనీ (78), అలైసా హీలీ (99), సథర్‌ల్యాండ్‌ (54 నాటౌట్‌) అర్దసెంచరీలు చేసి ఆసీస్‌ను ఆదుకున్నారు.  సౌతాఫ్రికా మహిళల జట్టుకు ఇది తొలి టెస్ట్‌ మ్యాచ్‌ కావడం విశేషం.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)