Breaking News

అశ్విన్‌తో ఢీకి రెడీ!

Published on Mon, 11/18/2024 - 04:04

మెల్‌బోర్న్‌: భారత వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని, ఈసారి అతడు మ్యాచ్‌పై పట్టు బిగించకుండా చేస్తానని ఆ్రస్టేలియన్‌ స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. కంగారూ గడ్డపై అశ్విన్‌కు మంచి రికార్డు లేదు. స్వదేశంలో 21.57 సగటు నమోదు చేస్తే ఆసీస్‌లో అది 42.15 మాత్రమే. అయితే గత రెండు బోర్డర్‌–గావస్కర్‌ సిరీస్‌లలో ఫామ్‌లో ఉన్న స్మిత్‌ను అదే పనిగా అవుట్‌ చేసి పైచేయి సాధించాడు. 

ఈ రెండు సిరీస్‌లలో అశ్విన్‌ అతన్ని క్రీజులో పాతుకుపోనీయకుండా ఐదుసార్లు పెవిలియన్‌ చేర్చాడు. దీనిపై ఆసీస్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్‌ మాట్లాడుతూ ‘ఈసారి అలా జరగకుండా చూసుకోవాలి. అయితే అశ్విన్‌ మాత్రం ఉత్తమ స్పిన్నర్‌. తప్పకుండా తన ప్రణాళికలు తనకు ఉంటాయి. గతంలో అతని ఎత్తుగడలకు బలయ్యాను. నాపై అతనే ఆధిపత్యం కనబరిచాడు. 

ఇప్పుడలా జరగకుండా చూసుకోవాలంటే ఆరంభంలోనే అతను పట్టు బిగించకుండా దీటుగా ఎదుర్కోవాలి’ అని అన్నాడు. గత కొన్నేళ్లుగా తమ ఇద్దరి మధ్య ఆసక్తికర సమరమే జరుగుతోందన్నాడు. ఒకరు పైచేయి సాధిస్తే, మరొకరు డీలా పడటం జరుగుతుందని... ఐదు టెస్టుల్లో పది ఇన్నింగ్స్‌ల్లో ఇప్పుడు ఎవరూ ఆధిపత్యం కనబరుస్తారో చూడాలని స్మిత్‌ తెలిపాడు. 

అతన్ని బ్యాట్‌తో పాటు మానసికంగానూ దెబ్బకొట్టాలంటే ఆరంభంలోనే మంచి షాట్లతో ఎదురుదాడికి దిగాలని చెప్పాడు. 35 ఏళ్ల స్మిత్‌ టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయికి 315 పరుగుల దూరంలో ఉన్నాడు. త్వరలో జరిగే ఐదు టెస్టుల బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో అతను తనకెంతో ఇష్టమైన, అచ్చొచి్చన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయనున్నాడు. ఇటీవలి కాలంలో స్మిత్‌ తరచూ ఓపెనర్‌గా బరిలోకి దిగి పూర్తిగా విఫలమయ్యాడు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)