Breaking News

Cameron Green: రెండో వేగవంతమైన సెంచరీ

Published on Sun, 08/24/2025 - 17:13

సౌతాఫ్రికాతో ఇవాళ (ఆగస్ట్‌ 24) జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 276 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. టాప్‌-3 ప్లేయర్లు ట్రవిస్‌ హెడ్‌ (103 బంతుల్లో 142; 17 ఫోర్లు, 5 సిక్సర్లు), మిచెల్‌ మార్ష్‌ (106 బంతుల్లో 100; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), కెమరూన్‌ గ్రీన్‌ (55 బంతుల్లో 118 నాటౌట్‌; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకాలతో హోరెత్తించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగుల రికార్డు స్కోర్‌ చేసింది.

అనంతరం​ కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. కూపర్‌ కన్నోలీ (6-0-22-5), జేవియర్‌ బార్ట్‌లెట్‌ (6-0-45-2), సీన్‌ అబాట్‌ (4-0-27-2), ఆడమ్‌ జంపా (4.5-1-31-1) ధాటికి 155 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డెవాల్డ్‌ బ్రెవిస్‌ (49) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఈ గెలుపుతో ఆసీస్‌ ఇదివరకే కోల్పోయిన సిరీస్‌లో సౌతాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు వన్డేల్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్‌ 1-2 తేడాతో కైవసం చేసుకుంది.

రెండో వేగవంతమైన సెంచరీ
ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ యువ ఆల్‌రౌండర్‌ కెమరూన్‌ గ్రీన్‌ శివాలెత్తిపోయాడు. మూడో స్థానంలో బరిలోకి దిగి కేవలం 47 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ సెంచరీ వన్డేల్లో ఆసీస్‌ తరఫున రెండో వేగవంతమైందిగా రికార్డైంది. 2023లో మ్యాక్స్‌వెల్‌ నెదర్లాండ్స్‌పై చేసిన 40 బంతుల శతకం.. వన్డేల్లో ఆసీస్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీగా కొనసాగుతుంది.

వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యంత వేగవంతమైన శతకాలు (టాప్‌-4)
40 - గ్లెన్ మాక్స్‌వెల్ vs NED, ఢిల్లీ, 2023 
47 - కామెరాన్ గ్రీన్ vs SA, మెకే, 2025* 
51 - గ్లెన్ మాక్స్‌వెల్ vs SL, సిడ్నీ, 2015 
57 - జేమ్స్ ఫాల్క్‌నర్ vs IND, బెంగళూరు, 2013
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)