Breaking News

ఆసీస్‌తో మూడో టెస్ట్‌.. పాక్‌ లోయర్‌ ఆర్డర్‌ అద్భుత పోరాటం

Published on Wed, 01/03/2024 - 15:14

సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైంది. 96 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దశ నుంచి పాక్‌ అద్భుతంగా తేరుకుంది. లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు మొహమ్మద్‌ రిజ్వాన్‌ (88), అఘా సల్మాన్‌ (53), ఆమిర్‌ జమాల్‌ (82) వీరోచితంగా పోరాడి పాక్‌ పరువు కాపాడారు.

ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌, సైమ్‌ అయూబ్‌ డకౌట్లు కాగా.. షాన్‌ మసూద్‌ (35), బాబర్‌ ఆజమ్‌ (26) కాసేపు ఆసీస్‌ బౌలర్లను నిలువరించారు. ఆతర్వాత స్వల్ప వ్యవధిలో వీరిద్దరితో పాటు సౌద్‌ షకీల్‌ (5) ఔట్‌ కావడంతో పాక్‌ కష్టాల్లో పడింది. ఈ దశలో రిజ్వాన్‌.. అఘా సల్మాన్‌, ఆమిర్‌ జమాల్‌ సహకారంతో పాక్‌కు ఫైటింగ్‌ టోటల్‌ను అందించాడు.

తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆమిర్‌ జమాల్‌ ఆసీస్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగి 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ మరోసారి అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శనతో (5/61) చెలరేగి పాక్‌ వెన్నువిరచగా.. స్టార్క్‌ (2/75), హాజిల్‌వుడ్‌ (1/65), లయోన్‌ (1/74), మార్ష్‌ (1/27) మిగతా పనిని కానిచ్చేశారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆసీస్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కెరీర్‌లో చివరి టెస్ట్‌ ఆడుతున్న డేవిడ్‌ వార్నర్‌ 6, ఉస్మాన్‌ ఖ్వాజా 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్‌ ఇదివరకే 2-0 తేడాతో కైవసం​ చేసుకుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)