Breaking News

మళ్లీ అదే పొరపాటు.. తలపట్టుకున్న ఆఫ్రిది! ఆటకు వర్షం అంతరాయం

Published on Tue, 12/26/2023 - 09:24

Australia vs Pakistan, 2nd Test Day 1: ఆస్ట్రేలియా- పాకిస్తాన్‌ మధ్య రెండో టెస్టు ఆరంభమైంది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పర్యాటక పాక్‌.. తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. 

కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ నమ్మకాన్ని నిలబెడుతూ పాకిస్తాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నారు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను 38 పరుగులకే పరిమితం చేశారు.

వార్నర్‌ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ వదిలేశాడు
నిజానికి మూడో ఓవర్‌ ఆఖరి బంతికే అతడు అవుట్‌ కావాల్సింది. కానీ అబ్దుల్లా షఫీక్‌ చేసిన పొరపాటు వల్ల వార్నర్‌కు లైఫ్‌ లభించింది. షాహిన్‌ ఆఫ్రిది బౌలింగ్‌లో వార్నర్‌ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను షఫీక్‌ జారవిడిచాడు. అప్పటికి ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు.

అయితే, షషీక్‌ పొరపాటు వల్ల బతికిపోయిన వార్నర్‌ను పాక్‌ స్పిన్నర్‌ ఆఘా సల్మాన్‌ పెవిలియన్‌కు పంపాడు. 28వ ఓవర్‌ మొదటి బంతికి సల్మాన్‌ బౌలింగ్‌లో.. ఫస్ట్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న బాబర్‌ ఆజంకు క్యాచ్‌ ఇచ్చి వార్నర్‌ వెనుదిరిగాడు.

ఖవాజాను అవుట్‌ చేసిన హసన్‌ అలీ
ఇక మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా(101 బంతుల్లో 42 పరుగులు)ను పేసర్‌ హసన్‌ అలీ అద్భుత బంతితో అవుట్‌ చేశాడు. 33.1 ఓవర్‌ వద్ద అఘా సల్మాన్‌ అందుకున్న క్యాచ్‌తో ఖవాజా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ప్రస్తుతం మార్నస్‌ లబుషేన్‌ 14, స్టీవ్‌ స్మిత్‌ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఆటకు వర్షం అంతరాయం
కాగా ఆసీస్‌- పాక్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి ఆస్ట్రేలియా 42.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.

అప్పుడు ఖవాజా.. ఇప్పుడు వార్నర్‌
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పెర్త్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్యాట్‌ కమిన్స్‌ బృందం ఏకంగా 360 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. 

ఇక ఈ మ్యాచ్‌లోనూ ఖవాజా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను షఫీక్‌ జారవిడిచిన విషయం తెలిసిందే. తాజాగా రెండో టెస్టులోనూ తప్పిదాన్ని పునరావృతం చేశాడు. అయితే, ఈసారి వార్నర్‌ క్యాచ్‌ను వదిలేశాడు. దీంతో అతడిపై నెట్టింట మరోసారి ట్రోల్స్‌ మొదలయ్యాయి.

చదవండి: IPL 2024: పాండ్యా కోసం రూ. 100 ​కోట్లు చెల్లించిన ముంబై? బంగారు బాతు కదా!

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)