Breaking News

AUS VS PAK 1st Test: 500 వికెట్ల క్లబ్‌లో చేరిన లియోన్‌ 

Published on Sun, 12/17/2023 - 15:55

మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా పెర్త్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటి పాక్‌ను మట్టికరిపించారు.

ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ వెటరన్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ 500 వికెట్ల అరుదైన క్లబ్‌లో చేరాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో లియోన్ సహా కేవలం​ ఎనిమిది మంది మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఈ జాబితాలో లంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్‌ (133 టెస్ట్‌ల్లో 800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. షేన్‌ వార్న్‌ (708), జేమ్స్‌ ఆండర్సన్‌ (690), అనిల్‌ కుంబ్లే (619), స్టువర్ట్‌ బ్రాడ్‌ (604), గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ (563), కోట్నీ వాల్ష్‌ (519) లియోన్‌ కంటే ముందు 500 వికెట్ల క్లబ్‌లో చేరిన వారిలో ఉన్నారు.

సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఫహీమ్‌ అష్రాఫ్‌ వికెట్‌ పడగొట్టడం ద్వారా లియోన్‌ ఈ లెజెండరీ క్లబ్‌లో చేరాడు. 36 ఏళ్ల లియోన్‌ 123 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించి ఆసీస్‌ తరఫున ఈ ఫీట్‌ సాధించిన మూడో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. లియోన్‌కు ముందు వార్న్‌, మెక్‌గ్రాత్‌ ఆసీస్‌ తరఫున 500 వికెట్ల క్లబ్‌లో చేరారు. లియోన్‌ తన 500 వికెట్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లి సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 5 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 3, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 2) సాధించిన లియోన్‌ ఆసీస్‌ గెలుపులో తనవంతు పాత్ర పోషించాడు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 233/5 చేయగా.. పాక్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 271, 89 పరుగులు చేసి చిత్తుగా ఓడింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ వార్నర్‌ 164 పరుగులతో చెలరేగిపోగా.. మిచెల్‌ మార్ష్‌ 90 పరుగులు చేసి ఔటయ్యాడు. పాక్‌ అరంగేట్రం బౌలర్‌ ఆమిర్‌ జమాల్‌ 6 వికెట్లు పడగొట్టాడు. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (62) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఆసీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్‌ ఖ్వాజా (90), మిచెల్‌ మార్ష్‌ (63 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించగా.. పాక్‌ బౌలర్లలో ఖుర్రమ్‌ 3 వికెట్లతో పర్వాలేదనిపించాడు. అనంతరం పాక్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో సౌద్‌ షకీల్‌ (24), బాబర్‌ ఆజమ్‌ (14), ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. స్టార్క్‌, హాజిల్‌వుడ్‌ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్‌ మెల్‌బోర్న్‌ వేదికగా డిసెంబర్‌ 26 నుంచి ప్రారంభమవుతుంది. 


 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు