Breaking News

పాక్‌తో తొలి టెస్ట్‌.. సెంచరీ చేజార్చుకున్న మార్ష్‌.. ఆసీస్‌ భారీ స్కోర్‌

Published on Fri, 12/15/2023 - 16:40

పెర్త్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది. తొలి రోజు ఆటలో వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ భారీ శతకంతో (164) చెలరేగగా.. రెండో రోజు మిడిలార్డర్‌ బ్యాటర్‌ మిచెల్‌ మార్ష్‌ (90) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు.

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్‌ ఖ్వాజా (41), స్టీవ్‌ స్మిత్‌  (31), ట్రవిస్‌ హెడ్‌ (40), అలెక్స్‌ క్యారీ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. లబూషేన్‌ (16), మిచెల్‌ స్టార్క్‌ (12), కమిన్స్‌ (9), నాథన్‌ లయోన్‌ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. పాక్‌ బౌలర్లలో అరంగేట్రం పేసర్‌ ఆమిర్‌ జమాల్‌ ఆరు వికెట్ల ప్రదర్శనతో అరదగొట్టగా.. మరో అరంగ్రేటం బౌలర్‌ ఖుర్రమ్‌ షెహజాద్‌ 2, షాహీన్‌ అఫ్రిది, ఫహీమ్‌ అష్రాఫ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి ఆసీస్‌ స్కోర్‌కు ఇంకా 355 పరుగులు వెనకపడి ఉంది. పాక్‌ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్‌ 42, కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ 30 పరుగులు చేసి ఔట్‌ కాగా.. ఇమామ్‌ ఉల్‌ హాక్‌ 38, ఖుర్రమ్‌ షెహజాద్‌ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం పాకిస్తాన్‌.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌ అనంతరం పాక్‌ డిసెంబర్‌ 26 నుంచి మెల్‌బోర్న్‌లో రెండో టెస్ట్‌ ఆడుతుంది. అనంతరం వచ్చే ఏడాది జనవరి 3 నుంచి సిడ్నీలో మూడో టెస్ట్‌ జరుగుతుంది. ఈ సిరీస్‌తో ఆసీస్‌ వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)