Breaking News

శివాలెత్తిన మిచెల్‌ మార్ష్‌, టిమ్‌ డేవిడ్‌.. భారీ స్కోర్‌ను ఊదేసిన ఆస్ట్రేలియా

Published on Wed, 02/21/2024 - 15:50

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన తొలి టీ20లో పర్యాటక ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. మిచెల్‌ మార్ష్‌ (44 బంతుల్లో 72 నాటౌట్‌; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (10 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. టిమ్‌ డేవిడ్‌ చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్‌ను గెలిపించాడు. 

కాన్వే, రచిన్‌ మెరుపు అర్దశతకాలు..
ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (46 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్‌ డౌన్‌ బ్యాటర్‌ రచిన్‌ రవీంద్ర (35 బంతుల్లో 68; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ చేసింది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో ఫిన్‌ అలెన్‌ (17 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడగా.. ఆఖర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (19 నాటౌట్‌), మార్క్‌ చాప్‌మన్‌ (18 నాటౌట్‌) వేగంగా పరుగులు సాధించారు. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ మార్ష్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

శివాలెత్తిన మార్ష్‌, డేవిడ్‌..
216 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. మార్ష్‌, టిమ్ డేవిడ్‌ మెరుపు ఇన్నింగ్స్‌లతో విధ్వంసం సృష్టించడంతో చివరి బంతి​కి (4 వికెట్ల నష్టానికి) విజయం​ సాధించింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో మిగతా ఆటగాళ్లు కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ట్రవిస్‌ హెడ్‌ 24, డేవిడ్‌ వార్నర్‌ 32, మ్యాక్స్‌వెల్‌ 25, ఇంగ్లిస్‌ 20 పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో సాంట్నర్‌ 2, ఆడమ్‌ మిల్నే, ఫెర్గూసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్‌ ఆక్లాండ్‌ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది.

బౌండరీ కొట్టి గెలిపించిన డేవిడ్‌..
చివరి మూడు బంతుల్లో (సౌథీ బౌలింగ్‌లో) 12 పరుగులు అవసరం కాగా.. టిమ్‌ డేవిడ్‌ వరసగా 6, 2, 4 పరుగులు స్కోర్‌ చేసి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ ఓవర్‌లో మార్ష్‌, డేవిడ్‌​ కలిపి 16 పరుగులు సాధించారు. అంతకుముందు ఓవర్‌లో (19) కూడా టిమ్‌ డేవిడ్‌ వీర బాదుడు బాదాడు. మిల్నే వేసిన ఈ ఓవర్‌లో డేవిడ్‌ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఈ ఓవర్‌లో మొత్తం 19 పరుగులు వచ్చాయి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)