Breaking News

ATP Rankings: నంబర్‌వన్‌ బోపన్న

Published on Tue, 01/30/2024 - 04:33

లండన్‌: సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) పురుషుల డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో 21 ఏళ్ల తర్వాత మళ్లీ భారత ప్లేయర్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అధిరోహించాడు. సోమవారం విడుదల చేసిన అధికారిక తాజా ర్యాంకింగ్స్‌లో రోహన్‌ బోపన్న రెండు స్థానాలు ఎగబాకి తన కెరీర్‌లో తొలిసారి టాప్‌ ర్యాంక్‌లో నిలిచి చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.

టెన్నిస్‌ చరిత్రలోనే నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకున్న అతిపెద్ద వయసు్కడిగా బోపన్న (43 ఏళ్ల 330 రోజులు) ప్రపంచ రికార్డు సృష్టించాడు.  అమెరికా దిగ్గజం మైక్‌ బ్రయాన్‌ (41 ఏళ్ల 76 రోజులు; 2019లో) పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు. గత శనివారం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోరీ్నలో బోపన్న ఆ్రస్టేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి పురుషుల డబుల్స్‌ విభాగంలో టైటిల్‌ నెగ్గి తన కెరీర్‌లో పురుషుల డబుల్స్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో బోపన్న, ఎబ్డెన్‌ 8,450 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ తక్కువ టోరీ్న లు ఆడినందుకు బోపన్నకు టాప్‌ ర్యాంక్‌ ఖరారుకాగా, ఎబ్డెన్‌ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. చివరిసారి భారత్‌ నుంచి లియాండర్‌ పేస్‌ 2000 మార్చి 13న ... మహేశ్‌ భూపతి 1999 జూన్‌ 14న ఏటీపీ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచారు. బెంగళూరుకు చెందిన బోపన్న 2003లో ప్రొఫెషనల్‌గా మారాడు. తన 21 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో బోపన్న ఇప్పటిదాకా పురుషుల డబుల్స్‌లో 19 మంది వేర్వేరు భాగస్వాములతో ఆడి 25 టైటిల్స్‌ సాధించడంతోపాటు 504 మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. 2016లో బెంగళూరులో తన పేరిట టెన్నిస్‌ అకాడమీని స్థాపించి కుర్రాళ్లకు శిక్షణ ఇస్తున్నాడు.   
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)