సొంతగడ్డపై భారత్‌కు పరీక్ష

Published on Mon, 11/11/2024 - 03:18

రాజ్‌గిర్‌ (బిహార్‌): పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత పొందకపోవడం... ఆ తర్వాత ప్రొ హాకీ లీగ్‌లోనూ ఆడిన 16 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో విజయం సాధించడం... వెరసి ఈ ఏడాది భారత మహిళల హాకీ జట్టుకు ఏదీ కలసి రాలేదు. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై వరుసగా రెండోసారి జరుగుతున్న ఆసియా మహిళల హాకీ చాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టు ప్రదర్శనపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. హెడ్‌ కోచ్‌ హరేంద్ర సింగ్‌ పర్యవేక్షణలో సలీమా టెటె సారథ్యంలో భారత బృందం ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

సోమవారం జరిగే తొలి లీగ్‌ మ్యాచ్‌లో మలేసియాతో భారత్‌ తలపడుతుంది. సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు ఈ మ్యాచ్‌ మొదలవుతుంది. గత ఏడాది రాంచీలో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈసారీ టైటిల్‌ నిలబెట్టుకోవాలంటే టీమిండియా అన్ని రంగాల్లో సమష్టిగా రాణించాల్సి ఉంటుంది. పారిస్‌ ఒలింపిక్స్‌ రజత పతక విజేత చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌ జట్లు కూడా ఈ టోర్నీలో ఆడుతున్నాయి. 

తొలి రోజు జరిగే ఇతర మ్యాచ్‌ల్లో జపాన్‌తో దక్షిణ కొరియా (మధ్యాహ్నం గం. 12:15 నుంచి), చైనాతో థాయ్‌లాండ్‌ (మధ్యాహ్నం గం. 2:30 నుంచి) తలపడతాయి. సోమవారం మలేసియాతో మ్యాచ్‌ తర్వాత భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌ల్లో కొరియా (12న)తో, థాయ్‌లాండ్‌ (14న)తో, చైనా (16న)తో, జపాన్‌ (17న)తో ఆడుతుంది. లీగ్‌ దశ ముగిశాక టాప్‌–4లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్‌ చేరుకుంటాయి. సెమీఫైనల్స్‌ 19న, ఫైనల్‌ 20న జరుగుతాయి.  

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)