Breaking News

Asian Mixed Team Championships: భారత్‌కు కాంస్యం

Published on Sun, 02/19/2023 - 00:46

దుబాయ్‌: ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు కాంస్య పతకం లభించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 2–3తో చైనా చేతిలో పోరాడి ఓడిపోయింది. భారత స్టార్స్‌ ప్రణయ్, పీవీ సింధు తమకంటే తక్కువ ర్యాంక్‌ ఉన్న ప్లేయర్ల చేతిలో ఓడిపోవడం భారత్‌ను దెబ్బ తీసింది.

తొలి మ్యాచ్‌లో 9వ ర్యాంకర్‌ ప్రణయ్‌ 13–21, 15–21తో 121వ ర్యాంకర్‌ లె లాన్‌ జీ (చైనా) చేతిలో... రెండో మ్యాచ్‌లో 9వ ర్యాంకర్‌ పీవీ సింధు 9–21, 21–16, 18–21తో 101వ ర్యాంకర్‌ గావో ఫాంగ్‌ జీ (చైనా) చేతిలో ఓడిపోవడంతో భారత్‌ 0–2తో వెనుబడింది.

అయితే మూడో మ్యాచ్‌లో ధ్రువ్‌ కపిల–చిరాగ్‌ శెట్టి జోడీ 21–19, 21–19తో హి జి టింగ్‌–జౌ హావో డాంగ్‌ ద్వయంపై... నాలుగో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–18, 13–21, 21–19తో లియు షెంగ్‌ షు–తాన్‌ నింగ్‌ ద్వయంపై నెగ్గడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ఇషాన్‌–తనీషా ద్వయం 17–21, 13–21తో జియాన్‌ జాంగ్‌ బాంగ్‌–వె యా జిన్‌ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత్‌ కాంస్యంతో సంతృప్తి పడింది.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)