Breaking News

రెండు కాంస్యాలతో ముగింపు.. రోయింగ్‌లో మెరుగైన భారత్‌ ప్రదర్శన

Published on Tue, 09/26/2023 - 07:41

హాంగ్జౌ: గత ఆసియా క్రీడల్లో మూడు పతకాలు సాధించిన భారత రోయర్లు ఈసారి ఐదు పతకాలు గెలిచి తమ ప్రదర్శనను మెరుగుపర్చుకున్నారు. సోమవారం నాలుగు ఫైనల్స్‌లో భారత క్రీడాకారులు పోటీపడగా... రెండు ఈవెంట్స్‌లో కాంస్య పతకాలు సాధించారు. ఆదివారం భారత రోయర్లకు రెండు రజతాలు, ఒక కాంస్యం లభించాయి.

సోమవారం పురుషుల ఫోర్‌ ఈవెంట్‌లో జస్విందర్‌ సింగ్, భీమ్‌ సింగ్, పునీత్, ఆశిష్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది. భారత బృందం 2000 మీటర్ల దూరాన్ని 6ని:08.61 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల క్వాడ్రాపుల్‌ డబుల్‌ స్కల్స్‌ ఈవెంట్‌లో సత్నామ్‌ సింగ్, పరి్మందర్‌ సింగ్, జకర్‌ ఖాన్, సుఖ్‌మీత్‌ సింగ్‌లతో కూడిన భారత జట్టు కాంస్యం గెల్చుకుంది. భారత బృందం 2000 మీటర్ల దూరాన్ని 6ని:10.81 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది.   

నాడు తండ్రి... నేడు తనయుడు... 
2002 బుసాన్‌ ఆసియా క్రీడల్లో ఇందర్‌పాల్‌ సింగ్‌ సభ్యుడిగా ఉన్న భారత జట్టు కాక్స్‌లెస్‌ ఫోర్‌ ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. 21 ఏళ్ల తర్వాత ఇందర్‌పాల్‌ సింగ్‌ తనయుడు పరిమందర్‌ సింగ్‌ తండ్రి ఘనతను అందుకున్నాడు. పర్మిందర్‌ సభ్యుడిగా ఉన్న భారత జట్టు ఈసారి క్వాడ్రాపుల్‌ డబుల్‌ స్కల్స్‌లో కాంస్యం గెలిచింది.
చదవండి: World Cup 2023: ‘వీసా’ వచ్చేసింది...  రేపు హైదరాబాద్‌కు పాకిస్తాన్‌ జట్టు   

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)