Breaking News

నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ద్రవిడ్‌ అడిగాడు! అప్పుడు నేను..

Published on Mon, 07/24/2023 - 17:55

ఐపీఎల్‌లో గత రెండు సీజన్లలో పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు జితేశ్‌ శర్మ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గతేడాది 10 ఇన్నింగ్స్‌లో 234 పరుగులు సాధించిన ఈ వికెట్‌ కీపర్ బ్యాటర్‌.. 16వ ఎడిషన్లో 14 ఇన్నింగ్స్‌లో 309 రన్స్‌ తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఓసారి టీమిండియాకు   ఎంపికైన జితేశ్‌కు తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు.

శ్రీలంకతో టీ20 సిరీస్‌ నేపథ్యంలో ఈ విదర్భ బ్యాటర్‌కు పిలుపు వచ్చింది. కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ గాయపడటంతో అతడి స్థానంలో జితేశ్‌ను జట్టులోకి తీసుకున్నారు. కానీ ఇషాన్‌ కిషన్‌ రూపంలో వికెట్‌ కీపర్‌ అందుబాటులో ఉండటంతో అతడికి ఆడే అవకాశం రాలేదు.

ఈ క్రమంలో ఆసియా క్రీడలు-2023 సందర్భంగా మరోసారి అదృష్టం జితేశ్‌ తలుపుతట్టింది. చైనాలో జరుగునున్న ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొననున్న భారత ద్వితీయ శ్రేణి జట్టులో అతడికి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఏబీపీ న్యూస్‌తో మాట్లాడిన జితేశ్‌ మొదటిసారి జట్టుకు ఎంపికైనపుడు హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో జరిగిన సంభాషణ గురించి వెల్లడించాడు.

‘‘జితేశ్‌.. నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావో తెలుసా?’’ అని ద్రవిడ్‌ అడిగారు. అందుకు బదులుగా.. ‘‘వీలైనంత ఎక్కువ స్ట్రైక్‌రేటు నమోదు చేయడం నా బలం. త్వరత్వరగా పరుగులు రాబడతాను. అందుకే నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు’’ అని సమాధానమిచ్చాను.

అందుకు రాహుల్‌ సర్‌ కూడా.. ‘‘అవును.. నువ్వు ఇక్కడిదాకా వచ్చింది అందుకే! నీదైన శైలిలో ఆడు.. జట్టు కోసం ఆడు.. ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది’’ అని చెప్పారు’’ అంటూ 29 ఏళ్ల జితేశ్‌ డ్రెస్సింగ్‌రూం అనుభవాలు పంచుకున్నాడు. కాగా ఆసియా క్రీడలకు రింకూ సింగ్‌, జితేశ్‌ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ తదితరులు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ జట్టుకు రుతురాజ్‌ గైక్వాడ్‌ నాయకుడు.

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)