Breaking News

Asian Games 2023: చరిత్ర సృష్టించిన భారత్‌.. బ్యాడ్మింటన్‌లో తొలి స్వర్ణం

Published on Sat, 10/07/2023 - 14:31

ఏషియన్‌ గేమ్స్‌-2023 పతకాల వేటలో భారత్‌ దూసుకుపోతుంది. పతకాలకు సంబంధించి ఇవాళ ఉదయమే సెంచరీ మార్కు తాకిన భారత్‌ తాజాగా మరో స్వర్ణం సాధించింది. పురుషుల బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో భారత జోడీ చిరాగ్‌ షెట్టి, సాత్విక్‌ సాయిరాజ్‌ గోల్డ్‌ మెడల్‌ కైవసం చేసుకుంది. ఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ ద్వయం.. సౌతా కొరియా జోడీ కిమ్‌-చోయ్‌పై 21-18, 21-16 వరుస సెట్లలో విజయం సాధించి, చరిత్ర సృష్టించింది.

ఏషియన్‌ గేమ్స్ చరిత్రలో భారత్‌కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. గతంలో భారత్‌ ఎన్నడూ ఏషియన్‌ గేమ్స్‌లో గోల్డ్‌ సాధించలేదు. ప్రస్తుత ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు ఇది (బ్యాడ్మింటన్‌లో) మూడో పతకం. పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో సిల్వర్‌ మెడల్‌, పురుషుల సి​ంగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ కాంస్య పతకం సాధించారు. బ్యాడ్మింటన్‌ గోల్డ్‌తో భారత్‌ పతకాల సంఖ్య 101కి (26 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలు) చేరింది. 

అభినందనలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఏషియన్‌ గేమ్స్‌ బ్యాడ్మింటన్‌లో స్వర్ణ పతకం నెగ్గిన సాత్విక్‌సాయిరాజ్‌-చిరగ్‌ షెట్టి ద్వయానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. సాత్విక్‌సాయిరాజ్‌ను సీఎం జగన్‌ ప్రత్యేకంగా అభినందించారు. సాత్విక్‌ నాతో పాటు యావత్‌ ఆంధ్రప్రదేశ్‌ గర్వపడేలా చేశాడని కొనియాడాడు. 
 

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)