Breaking News

Asian Games 2023: నీరజ్‌ చోప్రాకు స్వర్ణం.. 80కి చేరిన భారత్‌ పతకాల సంఖ్య

Published on Wed, 10/04/2023 - 18:20

ఏషియన్‌ గేమ్స్‌ 2023లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. ఇదే ఈవెంట్‌లో కిషోర్‌ జెనా రజత పతకం నెగ్గాడు. గత ఏషియన్‌ గేమ్స్‌లో ఇదే ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌.. ఈసారి జావెలిన్‌ను 88.88 మీటర్లు విసిరి స్వర్ణాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ ఈవెంట్‌లో రజతం​ సాధించిన కిషోర్‌ 87.54 మీటర్లు జావెలిన్‌ను విసిరి, నీరజ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. ఈ ప్రదర్శనతో నీరజ్‌, కిషోర్‌ ఇద్దరు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. 

కాగా, జావెలిన్‌ త్రోలో రెండు పతకాలతో (గోల్డ్‌, సిల్వర్‌) భారత్‌ పతకాల సంఖ్య 80కి (17 గోల్డ్‌, 31 సిల్వర్‌, 32 బ్రాంజ్‌) చేరింది. పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 312 పతకాలతో (168 గోల్డ్‌, 93 సిల్వర్‌, 51 బ్రాంజ్‌) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. జపాన్‌ 144 మెడల్స్‌తో (36, 51, 57) రెండో స్థానంలో, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా 145 పతకాలతో (33, 44, 68)  మూడో స్థానంలో ఉన్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)