Breaking News

ఆసియా క్రీడల పతక విజేతలకు మోదీ ప్రశంస

Published on Wed, 10/11/2023 - 07:00

తదుపరి ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు మరెన్నో పతకాలు తెస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు మంగళవారం మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని వారందరినీ ప్రశంసించారు. ‘ప్రభుత్వం క్రీడాకారులకు ఏం కావాలో అది చేస్తుంది. వారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

ఈ ఆసియా క్రీడల్లో వందకు పైగా పతకాలు సాధించిన క్రీడాకారులు వచ్చే క్రీడల్లో ఈ రికార్డును అధిగమిస్తారనే నమ్మకముంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారని ఆశిస్తున్నాను’అని మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో పురుషుల టెన్నిస్‌ డబుల్స్‌లో రజత పతకం గెలిచిన సాకేత్‌ మైనేని, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్వర్ణ పతకం నెగ్గిన రుతుజా భోస్లే ప్రధానికి జ్ఞాపికగా రాకెట్‌ను అందించారు.

స్వర్ణ పతకాలు గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు హాకీ స్టిక్‌ను, క్రికెట్లు జట్లు బ్యాట్‌ను మోదీకి బహూకరించాయి.  హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల బృందం 107 పతకాలు సాధించి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. తదుపరి ఆసియా క్రీడలు 2026లో జపాన్‌లో జరుగుతాయి.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)