Breaking News

ఏషియన్‌ గేమ్స్‌లో హైడ్రామా.. రజతంతో సరిపెట్టుకున్న ఆంధ్ర అమ్మాయి

Published on Sun, 10/01/2023 - 19:53

ఏషియన్‌ గేమ్స్‌ 2023లో ఇవాళ (అక్టోబర్‌ 1) హైడ్రామా చోటు చేసుకుంది. మహిళల 100 మీటర్స్‌ హర్డిల్స్‌లో చైనా అథ్లెట్‌ వు యన్ని నిర్ణీత సమయానికంటే ముందే పరుగు ప్రారంభించి రెండో స్థానంలో నిలిచినప్పటికీ డిస్‌క్వాలిఫై అయ్యింది. తద్వారా ఈ పోటీలో మూడో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి జ్యోతి యర్రాజీకి రజత పతకం దక్కింది.

ఈ పోటీలో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన యర్రాజీ చైనా అథ్లెట్‌ చేసిన తప్పిదం కారణంగా లయ తప్పి రజతంతో సరిపెట్టుకుంది. చైనా అథ్లెట్‌ రేస్‌ ప్రారంభానికి ముందే పరుగు ప్రారంభించగా.. ఆమె పక్కనే ఉన్న జ్యోతి యార్రాజీ సైతం రేస్‌ అధికారికంగా ప్రారంభమైందని అనుకుని పరుగు మొదలుపెట్టింది. రేస్‌ పూర్తయిన అనంతరం అంపైర్లు పలు మార్లు రేస్‌ ఫుటేజ్‌లను పరిశీలించి, చైనా అథ్లెట్‌ను అనర్హురాలిగా ప్రకటించారు.

ఈ విషయంలో జ్యోతి యర్రాజీ ఉద్దశపూర్వకంగా ఎలాంటి తప్పిదం చేయలేదని నిర్ధారించుకుని ఆమెకు రజతం ప్రకటించారు నిర్వహకులు. ఏదిఏమైనప్పటికీ చైనా అథ్లెట్‌ చేసిన తప్పిదం కారణంగా మన విశాఖ అమ్మాయి ఏషియన్‌ గేమ్స్‌లో స్వర్ణం గెలిచే సువర్ణావకాశాన్ని కోల్పోయింది. యర్రాజీ సాధించిన పతకంతో ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య 52కు (13 స్వర్ణాలు, 20 రజతాలు, 19 కాంస్యాలు) చేరింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)