Breaking News

Asian Games: అదరగొట్టేశారు.. మన అమ్మాయికి ‘మరో’ స్వర్ణం

Published on Thu, 10/05/2023 - 11:59

Asian Games 2023: ఆసియా క్రీడలు-2023లో ఆర్చరీ కాంపౌండ్‌ వుమెన్స్‌ టీమ్‌ విభాగంలో భారత్‌ అదరగొట్టింది. చైనాలోని హెంగ్జూ వేదికగా గురువారం నాటి ఫైనల్లో చైనీస్‌ తైపీని ఓడించి స్వర్ణం గెలిచింది. బంగారు తల్లులు వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌ ఈ మేరకు దేశానికి మరో పసిడి పతకం అందించారు.

మన అమ్మాయికి మరో స్వర్ణం
తైపీ ప్లేయర్లు యీ- సువాన్‌ చెన్‌, ఐ- జో హాంగ్‌, లూ- యన్‌ వాంగ్‌లను 230-229తో ఓడించి గోల్డ్‌ మెడల్‌ సాధించారు. కాగా భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు 19వ ఆసియా క్రీడల్లో ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. ఓజస్‌ ప్రవీణ్‌ దేవ్‌తలే (భారత్‌)తో కలిసి ఆర్చరీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ విభాగంలో సురేఖ పసిడి పతకం అందుకున్న విషయం తెలిసిందే.

19 స్వర్ణాలు
బుధవారం నాటి ఫైనల్లో జ్యోతి సురేఖ–ఓజస్‌ ప్రవీణ్‌ జంట 159–158తో సో చేవన్‌–జేహూన్‌ జూ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలుపొందింది. అంతకుముందు సురేఖ–ఓజస్‌ సెమీఫైనల్లో 159–154తో కజకిస్తాన్‌ జోడీపై, క్వార్టర్‌ ఫైనల్లో 158–155తో మలేసియా జంటపై విజయం సాధించింది. ఇదిలా ఉంటే..  తాజాగా ఆర్చరీ కాంపౌండ్‌ వుమెన్స్‌ టీమ్‌ గెలుపుతో భారత్‌ స్వర్ణ పతకాల సంఖ్య 19కి చేరింది. మొత్తంగా ఇప్పటి వరకు 83(19 గోల్డ్‌, 31 సిల్వర్‌, 32 బ్రాంజ్‌) మెడల్స్‌ ఇండియా ఖాతాలో ఉన్నాయి.  

చదవండి: Gautam Gambhir: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్‌ టోర్నీ? ఆ బద్దకస్తులంతే! సిరాజ్‌, బుమ్రా సూపర్‌..

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)