Breaking News

Asian Games 2023: భారత్‌ ఖాతాలో 18వ స్వర్ణం.. ఆల్‌టైమ్‌ రికార్డు

Published on Wed, 10/04/2023 - 18:42

ఏషియన్‌ గేమ్స్‌ 2023 పతకాల వేటలో భారత్‌ దూసుకుపోతుంది. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా స్వర్ణం సాధించిన నిమిషాల వ్యవధిలోనే భారత ఫురుషుల రిలే టీమ్‌ (ముహమ్మద్‌ అనాస్‌ యహియా, అమోజ్‌ జాకబ్‌, ముహమ్మద్‌ అజ్మల్‌, రాజేశ్‌ రమేశ్‌) 4X400 మీటర్ల రేసులో గోల్డ్‌ మెడల్‌ కైవసం చేసుకుంది. ఈ రేసును భారత అథ్లెట్లు 3:01.58 సమయంలో పూర్తి చేశారు. ఈ పతకంతో భారత్‌ పతకాల సంఖ్య 81కి (18 గోల్డ్‌, 31 సిల్వర్‌, 32 బ్రాంజ్‌) చేరింది.

ఇవాళ ఉదయమే పతకాల సంఖ్య విషయంలో గత రికార్డును (2018 జకార్తా గేమ్స్‌లో 70 పతకాలు) అధిగమించిన భారత్‌.. నీరజ్‌, ఫురుషుల రిలే టీమ్‌ స్వర్ణాలతో ఏషియన్‌ గేమ్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డును నెలకొల్పింది. ఈ క్రీడల్లో స్వర్ణాల విషయంలో భారత్‌ గత రికార్డు 16గా ఉండింది. 2018 జకార్తా క్రీడల్లో భారత్‌ అత్యధికంగా 16 పతకాలు సాధించింది. తాజా క్రీడల్లో భారత్‌ స్వర్ణాల విషయంలో ఆల్‌టైమ్‌ రికార్డు (18) సాధించింది. ప్రస్తుత క్రీడల్లో భారత్‌ ఇదే జోరును కొనసాగిస్తే 100కు పైగా పతకాలు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే, మెన్స్‌ రిలే టీమ్‌ స్వర్ణంతో భారత్‌ పతకాల సంఖ్యను 81కి పెంచుకుని, పతాకల పట్టికలో  నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 316 పతకాలతో (171 గోల్డ్‌, 94 సిల్వర్‌, 51 బ్రాంజ్‌) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. జపాన్‌ 147 మెడల్స్‌తో (37, 51, 59) రెండో స్థానంలో, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా 148 పతకాలతో (33, 45, 70)  మూడో స్థానంలో ఉన్నాయి.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)