Breaking News

చైనాకు షాక్‌.. చాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా భారత్‌.. అరుదైన రికార్డు

Published on Wed, 11/20/2024 - 18:51

రాజ్‌గిర్‌(బిహార్‌): నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతం చేసింది. వుమెన్‌ ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో చైనాను ఓడించి.. టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కాగా సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీ భారత్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగింది.

అద్భుత విజయాలతో సెమీస్‌కు చేరుకున్న సలీమా బృందం.. అక్కడ జపాన్‌ను ఓడించి.. ఫైనల్‌కు చేరుకుంది. వరుసగా ఆరో గెలుపు నమోదు చేసి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో బుధవారం జరిగిన ఫైనల్లో.. పారిస్‌ ఒలింపిక్స్‌ సిల్వర్‌ మెడల్‌ విజేత, ఆసియా క్రీడల చాంపియన్‌ అయిన చైనాతో తలపడింది.

చైనాను 1-0తో ఓడించి
ఆద్యంతం ఆసక్తి రేపిన ఈ మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు చైనాను 1-0తో ఓడించి.. ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్‌ చాంపియన్‌గా నిలవడం ఇది మూడోసారి. ఈ క్రమంలో సౌత్‌ కొరియాతో కలిసి ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా అగ్రస్థానంలో నిలిచింది.

ఇక చైనాతో ఫైనల్లో భారత్‌ తరఫున దీపికా చేసిన ఒకే ఒక్క గోల్‌తో విజయం సలీమా బృందం సొంతమైంది. మూడో క్వార్టర్‌లో ఆమె గోల్‌ కొట్టి భారత్‌ను విజయపథంలో నిలిపింది. దీంతో రాజ్‌గిర్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.

ఇదిలా ఉంటే.. ఈ ప్రతిష్టాత్మ టోర్నీలో 2016, 2023లలో భారత మహిళా జట్టు చాంపియన్‌గా నిలిచింది విజేతగా నిలిచింది. అదే విధంగా.. 2013, 2018లలో రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది.

వుమెన్స్‌ ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ-2024లో పాల్గొన్న భారత జట్టు
గోల్‌ కీపర్స్‌- సవిత, బిచు దేవి ఖరీబామ్‌
డిఫెండర్స్‌- ఉదిత, జ్యోతి, వైష్ణవి విట్టల్‌ ఫాల్కే, సుశీలా చాను పఖ్రంబం, ఇషికా చౌదరి
మిడ్‌ఫీల్డర్స్‌- నేహా, సలీమా టెటె(కెప్టెన్‌), షర్మిలా దేవి, మనీషా చౌహాన్‌, సునేలిటా టొప్పో, లల్రేమిసియామి.
ఫార్వర్డ్స్‌- నవనీత్‌ కౌర్‌(వైస్‌ కెప్టెన్‌), ప్రీతీ దూబే, సంగీతా కుమారి, దీపికా, బ్యూటీ డంగ్‌డంగ్‌.

చదవండి: ICC: వరల్డ్‌ నంబర్‌ వన్‌గా హార్దిక్‌ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్‌ వర్మ.. ఏకంగా..

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)