Breaking News

సత్తా చాటిన భారత సీనియర్‌ అథ్లెట్‌ డెబోరా రేమండ్‌

Published on Tue, 11/11/2025 - 17:33

చెన్నై: ఆసియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌-2025 (Asia Masters Athletics Championships 2025) ఎడిషన్‌లో భారత సీనియర్‌ అథ్లెట్‌ డెబోరా రేమండ్‌ (Deborah raymond) సత్తా చాటారు. డెబ్బై ఏళ్లకు పైబడిన జావెలిన్‌ త్రో మహిళా విభాగంలో ఆమె రజత పతకం గెలిచారు. ఈటెను 16.90 మీటర్ల దూరం విసిరిన డెబోరా రెండో స్థానంలో నిలిచారు.

రెండు పతకాలు
థాయ్‌లాండ్‌కు చెందిన సిరిపన్‌ జన్‌ప్రామ్‌ (18.96 మీటర్లు) ఈ విభాగంలో స్వర్ణం గెలుచుకోగా.. అదే దేశానికి చెందిన లవాన్‌ జిరానర్ట్‌ (16.87 మీటర్లు) కాంస్యం కైవసం చేసుకున్నారు. ఇక 70 ప్లస్‌ షాట్‌పుట్‌ విభాగంలోనూ డెబోరా రేమండ్‌ సత్తా చాటారు. ఈ కేటగిరీలో కాంస్యం (6.52 మీటర్లు) కైవసం చేసుకుని డెబోరా తన ఖాతాలో రెండో పతకాన్ని జమ చేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. మణిపూర్‌కు చెందిన ఎస్‌ థంబాల్‌ శర్మ ( S Thambal Sharma) ఏకంగా నాలుగు పసిడి, ఒక రజతం గెలిచి.. 23వ ఆసియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో అత్యధిక పతకాలు గెలిచిన మేల్‌ అథ్లెట్‌గా నిలిచారు. 65 ప్లస్‌ మెన్స్‌ విభాగంలో 100 మీటర్ల పరుగు, పోల్‌ వాల్ట్‌, హై జంప్‌, 4*100 మీటర్ల రిలే రేసులో స్వర్ణాలు గెలిచిన థంబాల్‌ శర్మ.. 200 మీటర్ల రేసులో రజతం దక్కించుకున్నారు.  

భారత్‌ పసిడి పంట
కాగా చెన్నై వేదికగా నవంబరు 4- 9 వరకు జరిగిన 23వ ఆసియా మాస్టర్స్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ తరఫున మొత్తంగా 1831 పురుష, 817 మహిళా అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీలో భారత్‌కు పురుషుల విభాగంలో 159, మహిళల విభాగంలో 111 స్వర్ణాలు వచ్చాయి.

మనమే టాప్‌
అదే విధంగా.. పురుష అథ్లెట్లు మొత్తంగా 146 రజతాలు గెలుచుకోగా.. మహిళా అథ్లెట్లు 114 సిల్వర్‌ మెడల్స్‌తో సత్తా చాటారు. ఇక కాంస్యాల విషయానికొస్తే.. పురుష అథ్లెట్లకు 152, మహిళా అథ్లెట్లకు 132 లభించాయి. మొత్తంగా ఆసియా మాస్టర్స్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 814 పతకాలు లభించాయి.

మరోవైపు.. శ్రీలంక 139 పతకాలు గెలుచుకోగా.. థాయ్‌లాండ్‌ 77, ఇరాన్‌ 74, కజకిస్తాన్‌ 67, జపాన్‌ 48, మలేషియా 23, మంగోలియా 21, ఫిలిప్పైన్స్‌ 13, సింగపూర్‌ అథ్లెటిక్‌ 10, కువైట్‌ రెండు, బంగ్లాదేశ్‌ నాలుగు, చైనీస్‌ తైపీ ఒకటి, మాల్దీవ్స్‌ రెండు పతకాలు గెలుచుకున్నాయి. నేపాల్‌, చైనా, ఇండోనేషియా, సింగపూర్‌ మాస్టర్స్‌, హాంగ్‌ కాంగ్‌, జోర్డాన్‌, సౌదీ అరేబియా ఖాతా తెరవనే లేదు. 

కాగా 23వ ఆసియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 35 ప్లస్‌, 40 ప్లస్‌, 45 ప్లస్‌, 50 ప్లస్‌, 55 ప్లస్‌, 60 ప్లస్‌, 65 ప్లస్‌, 70 ప్లస్‌, 75 ప్లస్‌, 80 ప్లస్‌, 85 ప్లస్‌, 90 ప్లస్‌ వయో విభాగాల్లో మహిళా, పురుష అథ్లెట్లకు పోటీలు నిర్వహించారు.

చదవండి: ఆర్సీబీ వాళ్లిద్దరిని వదిలేస్తే చాలు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)