Breaking News

‘పసిడి’ ఆశలు ఆవిరి! ఇక ఏ గొడవా లేదు..

Published on Wed, 08/16/2023 - 08:59

Asia Games 2023- న్యూఢిల్లీ: ట్రయల్స్‌ లేకుండా ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు మినహాయింపు పొందిన మహిళా స్టార్‌ రెజ్లర్, డిఫెండింగ్‌ చాంపియన్‌ వినేశ్‌ ఫొగాట్‌ తాజాగా ఈ మెగా ఈవెంట్‌ నుంచి తప్పుకొంది. మోకాలు గాయం వల్ల హాంగ్జౌ ఈవెంట్‌లో పాల్గొనడం లేదని మంగళవారం ఆమె ప్రకటించింది. దీంతో మినహాయింపు అనుచితమంటూ కోర్టుకెక్కిన అంతిమ్‌ పంఘాల్‌కు 53 కేజీల కేటగిరీలో లైన్‌ క్లియరైంది.

ఆ విభాగంలో ట్రయల్స్‌లో నెగ్గి ఆసియా ఈవెంట్‌కు అర్హత సంపాదించినప్పటికీ... వినేశ్‌ బరిలో ఉండటం వల్ల ఆమె స్టాండ్‌బైగా కూర్చోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వినేశ్‌ తనంతట తానుగా తప్పుకోవడంతో ఇక ఏ గొడవా లేకుండా అంతిమ్‌ ఆసియా క్రీడల్లో పాల్గొననుంది.

‘పసిడి’ ఆశలు ఆవిరి
‘ట్రెయినింగ్‌లో ఎడమ మోకాలుకు గాయమైంది. స్కానింగ్‌లో గాయం తీవ్రత దృష్ట్యా సర్జరీ తప్పనిసరని వైద్యులు సూచించడంతో ఈ నెల 17న ముంబైలో ఆపరేషన్‌ చేయించుకుంటాను. దీనివల్ల జకార్తా ఆసియా క్రీడల్లో (2018) సాధించిన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలనుకున్న నా ఆశలు ఆవిరయ్యాయి’ అని వినేశ్‌ వాపోయింది.

రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ లైంగిక వేధింపులపై వినేశ్, భజరంగ్, సాక్షి మాలిక్‌ తదితరులు పలుమార్లు జంతర్‌మంతర వద్ద నిరసనకు దిగారు. డబ్లూఎఫ్‌ఐ అడ్‌హక్‌ కమిటీ వినేశ్, భజరంగ్‌లకు నేరుగా ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశమివ్వడం వివాదానికి కారణమైంది. దీనిపై ట్రయల్స్‌ గెలిచిన అంతిమ్‌ కోర్టును ఆశ్రయించింది.   

చదవండి: కలలు నిజమైన వేళ: వాళ్లు మెరిశారు..! ఇక అందరి దృష్టి అతడిపైనే..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)