Breaking News

మే 28న తేలనున్న ఆసియాకప్‌ భవితవ్యం!

Published on Thu, 05/25/2023 - 13:42

ఆసియా కప్‌ 2023 జరుగుతుందా లేదా అనే దానిపై మే 28న స్పష్టత రానుంది. అదే రోజు ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఫైనల్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్‌కు ఇప్పటికే శ్రీలంక క్రికెట్‌ బోర్డు(SLC),అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (ACB), బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుకు(BCB) ఆహ్వానాలు అందాయి. 

ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభానికి ముందే బీసీసీఐ.. ఆయా క్రికెట్‌ బోర్డులతో సమావేశం కానున్నట్లు ప్రధాన కార్యదర్శి.. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌  అధ్యక్షుడు జై షా ఒక ట్వీట్‌ చేశారు. ''మే 28న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఫైనల్‌కు బీసీబీ, ACB, లంక క్రికెట్‌ బోర్డు అధ్యక్షులు హాజరు కానున్నారు. ఆసియా కప్‌ 2023 నిర్వహణకు సంబంధించిన యాక్షన్‌ ప్లాన్‌ను ఇక్కడే చర్చించనున్నాం'' అంటూ తెలిపారు.

ఈ మీటింగ్‌లో ఆసియా కప్‌ నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. కాగా హైబ్రిడ్‌ మోడ్‌లో ఆసియా కప్‌ను నిర్వహించాలన్న పీసీబీ ప్రతిపాదనను కూడా మీటింగ్‌లో పరిశీలించనున్నారు. అయితే ఇంతకముందు ఆసియా కప్‌ పాక్‌లో జరిగితే తమ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ ఏసీసీని కోరింది. 

అందుకు ఏసీసీ అంగీకరించినా.. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) తొలుత ఒప్పుకోలేదు. అయితే అలా చేయకపోతే టీమిండియా ఆసియా కప్‌ ఆడదని.. అందువల్ల ఆయా బోర్డులకు తీవ్ర నష్టం చేకూరుతుందని అలా అయితే ఆసియా కప్‌ను రద్దు చేసే అవకాశం ఉంటుందని ఏసీసీ.. పీసీబీకీ అర్థమయ్యేలా వివరించింది. దీంతో హైబ్రిడ్‌ మోడ్‌లో ఆసియా కప్‌ నిర్వహణకు తాము సిద్దమే అని ప్రతిపాదనలు పంపింది. పీసీబీ ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకరించినట్లు తెలిసింది.

ఇక 2022లో టి20 ఫార్మాట్‌లో నిర్వహించిన ఆసియా కప్‌లో శ్రీలంక విజేతగా నిలిచింది. కాగా ఈసారి వన్డే వరల్డ్‌కప్‌ దృశ్యా ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఏసీసీ) ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక ఆసియా కప్‌ను అత్యధికంగా టీమిండియా ఏడుసార్లు గెలుచుకోగా.. శ్రీలంక ఆరుసార్లు, పాకిస్థాన్‌ రెండు సార్లు విజేతగా నిలిచింది.

చదవండి: 'కింగ్‌' కోహ్లి రికార్డు.. ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)