Breaking News

శ్రీలంక శుభారంభం

Published on Sat, 09/13/2025 - 23:29

అబుదాబి: ఆసియా కప్‌ టి20 టోర్నమెంట్‌లో శ్రీలంక శుభారంభం చేసింది. గ్రూప్‌ ‘బి’లో శనివారం జరిగిన మ్యాచ్‌లో అసలంక సారథ్యంలోని లంక 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. టాస్‌ నెగ్గిన శ్రీలంక ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులే చేసింది. ఓపెనర్లు తన్‌జీద్‌ హసన్‌ (0), పర్వేజ్‌  హుసేన్‌ (0) డకౌట్‌ కావడంతో జట్టు పరుగుల ఖాతా తెరువకముందే 2 టాపార్డర్‌ వికెట్లను కోల్పోయింది. 

జట్టు రెండంకెల స్కోరు 11కు చేరగానే తౌహీద్‌ హృదయ్‌ (8) రనౌటయ్యాడు. ఈ దశలో కెపె్టన్‌ లిటన్‌ దాస్‌ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు) కాసేపు పోరాడాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే మెహదీ హసన్‌ (9)తో పాటు లిటన్‌ దాస్‌ కూడా పెవిలియన్‌ చేరడంతో బంగ్లా 53 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో షమీమ్‌ (34 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), జాకీర్‌ అలీ (34 బంతుల్లో 41 నాటౌట్‌; 2 ఫోర్లు) రాణించారు. 

మరో వికెట్‌ పడకుండా జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 14.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లలో కుశాల్‌ మెండిస్‌ (3) నిరాశ పరచగా, నిసాంక (34 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కమిల్‌ మిషార (32 బంతుల్లో 46 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి నిసాంక రెండో వికెట్‌కు 95 పరుగులు జోడించాడు.  

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి