Breaking News

క్వార్టర్‌ ఫైనల్లో సింధు

Published on Fri, 04/28/2023 - 13:09

దుబాయ్‌: ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో మూడో పతకానికి భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు విజయం దూరంలో నిలిచింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సింధు 21–12, 21–15తో తొమ్మిదో ర్యాంకర్‌ హాన్‌ యువె (చైనా)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి చేరింది. హాన్‌ యువెపై సింధుకిది నాలుగో విజయం కావడం విశేషం. 2014, 2022లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు నెగ్గిన సింధు నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ఆన్‌ సె యంగ్‌ (దక్షిణ కొరియా)తో ఆడుతుంది.

గతంలో ఆన్‌ సె యంగ్‌తో ఆడిన ఐదుసార్లూ సింధు ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 21–16, 5–21, 21–18తో చికో ఔరా ద్వి వర్దాయో (ఇండోనేసియా)పై నెగ్గగా... కిడాంబి శ్రీకాంత్‌ 14–21, 22–20, 9–21తో కొడాయ్‌ నరోకా (జపాన్‌) చేతిలో ఓడిపోయాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సియో సెయుంగ్‌ జే–చె యు జంగ్‌ (దక్షిణ కొరియా) జోడీ నుంచి సిక్కి రెడ్డి–రోహన్‌ కపూర్‌ (భారత్‌) జంటకు వాకోవర్‌ లభించడంతో క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది.

పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం 21–13, 21–11తో జిన్‌ యోంగ్‌–నా సంగ్‌ సెంగ్‌ (కొరియా) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట గాయం కారణంగా బరిలోకి దిగకుండా ప్రత్యర్థి జోడీకి వాకోవర్‌ ఇచ్చింది.
చదవండి: IPL 2023: అందుకే ఆ పని పనిచేశా.. అతడు మాకు దొరికిన విలువైన ఆస్తి: శాంసన్‌

Videos

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు