Breaking News

Asian Champions Trophy 2024: ఎదురులేని భారత్‌

Published on Wed, 11/20/2024 - 06:08

రాజ్‌గిర్‌ (బిహార్‌): మరోసారి సాధికారిక ఆటతీరుతో అలరించిన భారత మహిళల హాకీ జట్టు సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో ఐదోసారి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ 2–0 గోల్స్‌ తేడాతో 2018 జకార్తా ఆసియా క్రీడల విజేత జపాన్‌ జట్టును ఓడించింది. భారత్‌ తరఫున వైస్‌ కెప్టెన్‌ నవ్‌నీత్‌ కౌర్‌ (48వ నిమిషంలో), లాల్‌రెమ్‌సియామి (56వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. సలీమా టెటె నాయకత్వంలో ఈ టోర్నీలో ఆడుతున్న భారత జట్టుకిది వరుసగా ఆరో విజయం కావడం విశేషం. 

లీగ్‌ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గిన టీమిండియా నాకౌట్‌ మ్యాచ్‌లోనూ గెలుపొందింది. నేడు జరిగే ఫైనల్లో పారిస్‌ ఒలింపిక్స్‌ రజత పతక విజేత, ప్రస్తుత ఆసియా క్రీడల చాంపియన్‌ చైనా జట్టుతో భారత్‌ తలపడుతుంది. తొలి సెమీఫైనల్లో చైనా 3–1తో మలేసియాపై గెలిచింది. లీగ్‌ దశలో భారత జట్టు 3–0తో చైనాపై గెలిచింది. అదే ఫలితాన్ని నేడూ పునరావృతం చేస్తే భారత జట్టు మూడోసారి ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంటుంది. అంతేకాకుండా దక్షిణ కొరియా (2010, 2011లలో) జట్టు తర్వాత వరుసగా రెండుసార్లు ఈ టైటిల్‌ను నెగ్గిన జట్టుగా భారత్‌ గుర్తింపు పొందుతుంది. గతంలో భారత జట్టు 2016, 2023లలో విజేతగా నిలిచింది. 2013, 2018లలో రన్నరప్‌ ట్రోఫీ సాధించింది.  

జపాన్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్‌ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మ్యాచ్‌ మొత్తంలో భారత జట్టుకు 12 పెనాల్టీ కార్నర్‌లు 
లభించగా... ఒక్కదానిని కూడా టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. లేదంటే భారత గెలుపు ఆధిక్యం భారీగా ఉండేది. మరోవైపు జపాన్‌ కేవలం ఒక్క పెనాల్టీ కార్నర్‌కే పరిమితమైంది.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)