Breaking News

'T20 వరల్డ్‌కప్‌లో అదే నా ఫేవరేట్‌ మూమెంట్‌.. నా కళ్లలో నీళ్లు తిరిగాయి'

Published on Tue, 07/23/2024 - 13:24

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 విజేత‌గా నిలిచి భార‌త్‌ త‌మ 13 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించిన సంగ‌తి తెలిసిందే. ఈ విజ‌యంతో స‌గర్వంగా భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, స్టార్ ప్లేయ‌ర్లు  విరాట్ కోహ్లి, ర‌వీంద్ర జ‌డేజా అంత‌ర్జాతీయ టీ20ల‌కు విడ్కోలు ప‌లికారు. వీరిముగ్గురు మాత్ర‌మే కాకుండా  రాహుల్ ద్రవిడ్ సైతం భార‌త హెడ్‌కోచ్‌గా త‌న ప్ర‌స్ధానాన్ని ముగించాడు. 

గ‌తేడాది వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన టీమిండియాకు.. 7 నెలల తిరిగకముందే పొట్టి ప్రపంచకప్ రూపంలో ఐసీసీ టైటిల్‌ను ది గ్రేట్ వాల్ అందించాడు. విజయనంతరం భారత ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

కొంతమంది ఆటగాళ్లు అయితే కన్నీటి పర్యంతమయ్యారు. ఈ భావోద్వేగ క్షణాలను యావత్తు ప్రపంచం వీక్షించింది. ఇక తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్‌లో తన ఫేవరేట్ మూమెంట్‌ను ఎంచుకున్నాడు. సెలబ్రేషన్స్ సమయంలో విరాట్ కోహ్లి ట్రోఫీని రాహుల్ ద్రవిడ్‌కు అందజేసినప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగినట్లు అశ్విన్ చెప్పుకొచ్చాడు.

"నిజంగా ఇది యావత్తు భారత్ గర్వించదగ్గ విజయం. మా 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అయితే ఈ టోర్నీలో విజయం సాధించిన తర్వాత ఓ మూమెంట్ నా మనసును హత్తుకుంది. విరాట్ కోహ్లి.. రాహుల్ ద్రవిడ్‌కు పిలిచి ట్రోఫీని అందిండచడం నన్ను ఎంతగానే ఆకట్టుకుంది.

ఇదే నా ఫేవరేట్ మూమెంట్‌. ద్రవిడ్ వెంటనే కప్‌ను అందుకుని గట్టిగా కేకలు వేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ క్షణం నా కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ద్రవిడ్ నుంచి ఇటువంటి సెలబ్రేషన్స్ ఇప్పటివరకు నేను చూడలేదు. అయితే అందుకు ఓ కారణముంది.

2007లో కరేబియన్ దీవుల వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ద్రవిడ్ సారథ్యంలోని భారత జట్టు గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. ఆ తర్వాత ద్రవిడ్ తన కెప్టెన్సీ నుంచి వైదొలగాడు. అప్పటి నుంచి జట్టులో కేవలం ఆటగాడిగా కొనసాగాడు. 

కెప్టెన్సీ నుంచి తప్పకున్నప్పటకి ద్రవిడ్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఒకవేళ భారత జట్టు మ్యాచ్ ఓడిపోయినా అందరూ ద్రవిడ్‌నే టార్గెట్ చేసేవారు. అప్పుడు తను కెప్టెన్‌గా సాధించలేకపోయింది.. ఇప్పుడు కోచ్‌గా సాధించి చూపించాడని" తన యూట్యూబ్ ఛానల్‌లో అశ్విన్ పేర్కొన్నాడు.
 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)