Breaking News

పోరాడుతున్న ఇంగ్లండ్‌.. రెండో రోజు ఆసీస్‌దే

Published on Thu, 12/18/2025 - 13:59

అడిలైడ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లండ్ జ‌ట్టు 8 వికెట్ల న‌ష్టానికి 213 ప‌రుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ బెన్ స్టోక్స్‌(45), జోఫ్రా ఆర్చ‌ర్‌(30) ఉన్నారు. వీరిద్ద‌రూ తొమ్మిదో వికెట్‌కు 45 ప‌రుగుల ఆజేయ భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. 

ఇంగ్లండ్ జ‌ట్టు ఇంకా 158 ప‌రుగుల వెన‌కంజ‌లో ఉంది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాట‌ర్ల పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది.  ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో స్టోక్స్‌, ఆర్చ‌ర్‌తో పాటు హ్యారీ బ్రూక్ (45), బెన్ డకెట్ (29) ఫ‌ర్వాలేద‌న్పించారు. వైస్ కెప్టెన్ పోప్‌(3), క్రాలీ(9), రూట్(19) తీవ్ర నిరాశ‌ప‌రిచారు.

ఆసీస్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. లియోన్‌, బోలాండ్ త‌లా రెండు వికెట్లు సాధించారు. మ‌రో వికెట్ గ్రీన్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక అంత‌కుముందు 326/8 ఓవ‌ర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన ఆసీస్ 371 ప‌రుగుల‌కు ఆలౌటైంది.  వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ (143 బంతుల్లో 106; 8 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా..ఖ‌వాజా(82), స్టార్క్‌(54) రాణించారు.

డీఆర్ఎస్ వివాదం..
కాగా ఈ మ్యాచ్‌లో డీఆర్ఎస్ వివాదం చోటు చేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీ బ్యాటింగ్ చేస్తుండ‌గా బంతి స్ప‌ష్టంగా బ్యాట్‌కు తాకిన‌ప్ప‌టికి.. స్నికోమీటర్ సాంకేతిక లోపం వల్ల స్పైక్ రాలేదు. ఇంగ్లండ్ రివ్యూ తీసుకున్న‌ప్ప‌టికి స్నికోమీట‌ర్‌లో స్పైక్ చూపించ‌క‌పోవ‌డంతో థ‌ర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్ర‌క‌టించారు. అయితే ఈ విష‌యంపై ఐసీసీ స్పందించింది. సాంకేతిక అంగీకరిస్తూ.. ఇంగ్లండ్ కోల్పోయిన రివ్యూను తిరిగి ఇచ్చింది

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)