నువ్వేం తండ్రివి? యువీ చితకబాదినపుడు ఎక్కడున్నావు? నీ స్థాయి మరచి..

Published on Sat, 07/08/2023 - 11:54

The Ashes, 2023: ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ తండ్రి, ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌పై క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. వయసు పెరగగానే సరిపోదు.. కాస్త బుద్ధి కూడా ఉండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రిఫరీగా వ్యవహరిస్తూ ఓ ఆటగాడి పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు.

ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌-2023 సీజన్‌లో ఇంగ్లండ్‌పై ఇప్పటికే రెండు విజయాలతో ఆస్ట్రేలియా పైచేయి సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్‌ వేదికగా గురువారం మూడో టెస్టు ఆరంభమైంది. తమకు అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్‌.. తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. 

పదిహేడో సారి
ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ అద్భుత సెంచరీ(118) కారణంగా మెరుగైన స్కోరు నమోదు చేయగలిగింది. 263 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(4) స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో పదహారోసారి అవుటయ్యాడు. 

ఇక రెండో ఇన్నింగ్స్‌లో(1)నూ అతడికే వికెట్‌ సమర్పించుకున్నాడు. కాగా టెస్టుల్లో బ్రాడ్‌ బౌలింగ్‌లో వార్నర్‌ అవుట్‌ కావడం ఇది పదిహేడోసారి. దీంతో వార్నర్‌ను ట్రోల్‌ చేస్తూ ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో మీమ్స్‌తో రెచ్చిపోయారు. 

మీమ్‌ను రీషేర్‌ చేసిన క్రిస్‌ బ్రాడ్‌
ఇందులో భాగంగా ఓ నెటిజన్‌.. అమెరికన్‌ యానిమేటెడ్‌ సిట్‌కామ్‌ సిరీస్‌ ది సింప్సన్స్‌లోని బార్ట్‌ అనే క్యారెక్టర్‌ను వార్నర్‌ ముఖంతో మార్ఫింగ్‌ చేసి పెట్టాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌ మళ్లీ నన్ను అవుట్‌ చేశాడు అని వార్నర్‌ బోర్డు మీద రాస్తున్నట్లుగా మీమ్‌ క్రియేట్‌ చేశాడు.

ఒకే ఓవర్లో 6 సిక్సర్లను గుర్తుచేస్తూ
ఈ మీమ్‌ను స్టువర్ట్‌ బ్రాడ్‌ తండ్రి క్రిస్‌ బ్రాడ్‌ రీషేర్‌ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘కొడుకు ప్రతిభ చూసి సంతోషపడటంలో తప్పులేదు. కానీ ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ అయి ఉండి ఇలా దిగజారిపోవడం ఏమీ బాగాలేదు. వార్నర్‌ను మరీ అంతగా తీసిపారేయాల్సిన అవసరం లేదు. మీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు’’ అని క్రిస్‌కు చురకలు అంటిస్తున్నారు.

ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్‌-2007లో స్టువర్ట్‌ బ్రాడ్‌ ఓవర్‌లో టీమిండియా స్టార్‌ యువరాజ్‌ సింగ్‌ ఆరు సిక్సర్లు బాదిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ‘‘యువీ బ్రాడ్‌ బౌలింగ్‌లో చితక్కొట్టినపుడు ఇలాంటి ట్వీట్లు చేయలేదు ఎందుకు?’’ అని సెటైర్లు వేస్తున్నారు. 

చదవండి: సినిమాను తలపించే ట్విస్టులు! కుటుంబాల మధ్య గొడవ.. సీక్రెట్‌గా ప్రేమా, పెళ్లి! ఆఖరికి
Ind vs WI: కోహ్లి, రోహిత్‌ వాళ్లిద్దరి బౌలింగ్‌లో! వీడియో వైరల్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)