Breaking News

పోతూ పోతూ రికార్డుల్లోకెక్కిన స్టువర్ట్‌ బ్రాడ్‌.. సిక్సర్‌తో..!

Published on Sun, 07/30/2023 - 18:35

దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌, ఇంగ్లండ్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ తన కెరీర్‌లో చివరాఖరి మ్యాచ్‌లో ఓ రికార్డు నమోదు చేశాడు. 37 ఏళ్ల బ్రాడీ అంతర్జాతీయ కెరీర్‌లో తానెదుర్కొన్న ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచి రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో బ్రాడ్‌ టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. కెరీర్‌లో 167 టెస్ట్‌లు ఆడిన బ్రాడ్‌ 55 సిక్సర్లు బాది బెన్‌ స్టోక్స్‌ (124), కెవిన్‌ పీటర్సన్‌ (81), ఆండ్రూ ఫ్లింటాఫ్‌ (78), ఇయాన్‌ బోథమ్‌ (67) తర్వాతి స్థానాల్లో నిలిచాడు. 

ఆఖరి టెస్ట్‌ కావడంతో బ్యాటింగ్‌కు దిగే ముందు ఆసీస్‌ ఆటగాళ్ల నుంచి గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ అందుకున్న బ్రాడ్‌.. అభిమానుల కేరింతలు, చప్పట్ల ధ్వనుల మధ్య క్రీజ్‌లోకి వచ్చాడు. వచ్చీ రాగానే (నాలుగో రోజు తొలి ఓవర్‌ ఆఖరి బంతి) స్టార్క్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది స్టేడియంలో ఉన్నవారిని ఉర్రూతలూగించాడు. 

అనంతరం మర్ఫీ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో ఆండర్సన్‌ ఎల్బీడబ్ల్యూగా ఔట్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 395 పరుగుల వద్ద ముగిసింది. కెరీర్‌లో ఆఖరి ఇన్నింగ్స్‌లో బ్రాడ్‌ (8, సిక్స్‌) నాటౌట్‌గా మిగిలాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ సాధించిన స్వల్ప లీడ్‌ను తీసేస్తే ఆ జట్టు టార్గెట్‌ 384 పరుగులైంది. 

ఛేదనకు దిగిన ఆసీస్‌.. నాలుగో రోజు లంచ్‌ విరామం సమయానికి 24 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖ్వాజా (39), డేవిడ్‌ వార్నర్‌ (30) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌ విజయానికి 309 పరుగులు, ఇంగ్లండ్‌ గెలుపుకు 10 వికెట్లు కావాలి.

కాగా, కెరీర్‌లో 167 టెస్ట్‌లు, 121, వన్డేలు, 56 టీ20లు ఆడిన బ్రాడ్‌ ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు (602) తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన బ్రాడ్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్‌ల్లో బ్రాడ్‌ 244 ఇన్నింగ్స్‌లు ఆడి 3662 పరుగులు చేశాడు. ఇతని ఖాతాలో సెంచరీ (169), 13 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.


 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)