Breaking News

ముందే సంబరపడితే ఇలాగే ఉంటది.. కీలకమైన స్టీవ్‌ స్మిత్‌ క్యాచ్‌ పట్టి వదిలేసిన స్టోక్స్‌

Published on Mon, 07/31/2023 - 19:05

యాషెస్‌ సిరీస్‌ 2023 ఐదో టెస్ట్‌ చివరి రోజు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ ఘోర తప్పిదం చేశాడు. కీలక సమయంలో (లంచ్‌కు ముందు ఓవర్‌ తొలి బంతికి) మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేసే స్టీవ్‌ స్మిత్‌ (40) క్యాచ్‌ను జారవిడిచాడు. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో స్మిత్‌ గ్లవ్స్‌ను తాకిన బంతిని లెగ్‌ గల్లీలో ఫీల్డింగ్‌ చేస్తున్న స్టోక్స్‌ అతికష్టం మీద (చాలా ఎత్తుకు ఎగిరి) పట్టుకున్నట్లే పట్టుకుని వదిలేశాడు.

సంబురాలు చేసుకునే తొందరలో స్టోక్స్‌ మోకాలికి తగిలి బంతి నేలపాలైంది. ఇంతటితో ఆగకుండా స్టోక్స్‌ రివ్యూకి వెళ్లి ఇంకో ఘోర తప్పిదం చేశాడు. రీప్లేలో బంతి స్మిత్‌ గ్లవ్స్‌కు తాకినట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ..  బంతి నిర్దిష్ట సమయం పాటు స్టోక్స్‌ చేతిలో లేకపోవడంతో థర్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ ఇంగ్లండ్‌ అప్పీల్‌కు నాటౌట్‌ అని సమాధానం ఇచ్చాడు. దీంతో కీలక సమయంలో ఇంగ్లండ్‌కు వికెట్‌ దక్కకపోగా, రివ్యూ కోల్పోయింది. 

కాగా, స్టోక్స్‌.. స్టీవ్‌ స్మిత్‌ క్యాచ్‌ జారవిడిచాక ఆట మరో 5 బంతుల పాటు సాగింది. అనంతరం అంపైర్లు లంచ్‌ విరామం ప్రకటించారు. ఇదే సమయంలో వర్షం కూడా మొదలైంది. లంచ్‌ విరామం సమయానికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 238/3గా ఉంది. స్టీవ్‌ స్మిత్‌ (40), ట్రవిస్‌ హెడ్‌ (31)  క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి ఆసీస్‌ గెలవాలంటే 146 పరుగులు, ఇంగ్లండ్‌ విజయానికి 7 వికెట్లు కావాల్సి ఉంది. లంచ్‌ విరామ సమయం పూర్తయ్యాక కూడా వర్షం పడుతుండటంతో అంపైర్లు మ్యాచ్‌ను పాక్షికంగా నిలిపివేశారు. 

ఇదిలా ఉంటే, 384 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 135/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా, తొలి సెషన్‌లోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కొత్త బంతితో ఇంగ్లండ్‌ పేసర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ వుడ్‌లు ఆసీస్‌ ఆటగాళ్లను వణికించారు.  ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (60), ఉస్మాన్‌ ఖ్వాజా (72).. తమ ఓవర్‌నైట్‌ స్కోర్లకు రెండు, మూడు పరుగుల చొప్పున జోడించి ఔట్‌ కాగా.. లబూషేన్‌ 13 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)